మాఘమాసం మనువుల నెల. వాట్సాప్‌లో ‘ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్’ గ్రూపుల నిండా వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికలే. ఇక మార్కెట్ విషయానికొస్తే.. నగల దుకాణాలు కళకళలాడుతున్నాయి. చీరల షాపులు సందడిగా కనిపిస్తున్నాయి.
అన్నట్టు, ఎదురుకోళ్ల నుంచి అప్పగింతల వరకు.. ఏదో ఓ సందర్భంలో కన్యామణి లెహంగా ధరించడం తాజా ట్రెండ్. అసలు, ఆ ఆలోచన లేకపోయినా.. మృణాల్ ఠాకూర్ నవ వధువు ముస్తాబులో కనిపిస్తున్న ఈ ఫొటోను కనుక చూస్తే పెండ్లికూతుళ్లు లెహంగా షాపింగ్‌కు బయల్దేరడం ఖాయం.