Life style | శృంగార కోరికలు పరుగులు తీయాలా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..!
Life style : శృంగారం అనేది ఆలుమగల మధ్య అయస్కాంత శక్తి లాంటిది. ఆస్వాదించినా కొద్దీ ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. అయితే వయసు పెరిగినా కొద్ది శృంగార వాంఛ తగ్గిపోతుంది. అది అందరిలో సాధారణమే. వయసు మీరిన తర్వాత శృంగార కోరికలు ఇద్దరిలోనూ తక్కువగానే ఉంటాయి. కానీ కొంతమందిలో మంచి వయసులో ఉండగానే శృంగారంపై ఆసక్తి సన్నగిల్లుతుంది.
Life style : శృంగారం అనేది ఆలుమగల మధ్య అయస్కాంత శక్తి లాంటిది. ఆస్వాదించినా కొద్దీ ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. అయితే వయసు పెరిగినా కొద్ది శృంగార వాంఛ తగ్గిపోతుంది. అది అందరిలో సాధారణమే. వయసు మీరిన తర్వాత శృంగార కోరికలు ఇద్దరిలోనూ తక్కువగానే ఉంటాయి. కానీ కొంతమందిలో మంచి వయసులో ఉండగానే శృంగారంపై ఆసక్తి సన్నగిల్లుతుంది. అంటే అప్పటిదాకా వారి మధ్య ఉన్న ఆయస్కాంత శక్తి నశించిపోతుంది. దాంతో అందరిలో కాకపోయినా కొందరిలో సఖ్యత దెబ్బతింటుంది. బంధం బలహీనపడి గొడవలు జరుగుతాయి.
ఇక వయసు మళ్లిన వారిలో శృంగార కోరికలు తగ్గడానికి వయసే కారణమైతే, వయసులో ఉన్నవారిలో శృంగార కోరికలు తగ్గడానికి జీవనవిధానంలో మార్పులు, మితిమీరిన శారీరక శ్రమ, అలసట, మానసిక ఒత్తిడి లాంటివి కారణాలుగా చెప్పవచ్చు. వృద్ధుల్లో శృంగార వాంఛ తగ్గడం సాధారణం కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ యుక్త వయస్కులు మాత్రం ఇలాంటి సమస్య నుంచి బయటపడాల్సిందే. కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. సన్నగిల్లిన కోరికలను గుర్రాల్లా పరుగెత్తించవచ్చు. మరి ఆ పదార్థాలేవో ఇప్పుడు తెలుసుకుందాం..
అవకాడోలు
శృంగార కోరికలను పెంచడమేగాకుండా, అంగస్తంభన లోపాలను సరిచేయడంలో అవకాడోలు (Avocadoes) బాగా పనిచేస్తాయి. రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించి రక్త ప్రవాహం మెరుగుపడేలా చేయడంలో కూడా ఇవి తోడ్పడుతాయి.
నత్తలు
అడుగంటిన శృంగార కోరికలను తట్టిలేపడంలో నత్తగుల్లలు (Snails) బాగా పనిచేస్తాయి. నత్తల్లో జింక్ సమృద్ధిగా ఉంటుంది. ఈ జింక్.. టెస్టోస్టిరాన్ అనే లైంగిక హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో, నరాల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చడంలో తోడ్పడుతుంది. కాబట్టి నత్తలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
సాల్మన్ చేప
సాల్మన్ చేపలు (Salman fishes) కూడా శృంగార వాంఛలు పెరుగడానికి తోడ్పడుతాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతోపాటు, ఇతర విటమిన్లు ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చి శృంగార కోరికలను పెంచుతాయి.
ఇవి కూడా..
పైన పేర్కొన్నవేగాక జింక్ ఎక్కువగా ఉండే రెడ్‌మీట్, ఉడికించిన బీన్స్, పాలు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, బాదం గింజలు, చిరు ధాన్యాలను తరచూ తీసుకోవడంవల్ల రక్త ప్రసరణ బాగా జరిగి శృంగార కోరికలు పెరుగుతాయి. అదేవిధంగా సిట్రస్ జాతి పండ్లు, ఆపిల్స్, బెర్రీస్, గ్రేప్స్, రెడ్ వైన్, టీ, డార్క్ చాక్లెట్స్ కూడా నరాల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. వీటితోపాటు నైట్రేట్స్ అధికంగా ఉండే పాలకూర, తోటకూర తదితర ఆకు కూరలు, ముల్లంగి, మునగ కాయలు లాంటివి కూడా శృంగార వాంఛలను రేకెత్తిస్తాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

