గోడలు అడవులు అవుతాయి. లోహాలు మొక్కలవుతాయి. ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఏదైనా సాధ్యమే. ఇనుము, స్టీల్, ఇత్తడి.. తదితర లోహాలను ఆకుల్లా, మొక్కల్లా మలిచి ఆకర్షణీయమైన రంగులు వేస్తున్నారు తయారీ దారులు. వాటిని గోడలకు బిగించుకుంటే.. గదికి కొత్త అందం వస్తుంది. కాబట్టే, గృహప్రవేశం ఖరారు కాగానే చాలామంది ‘మెటల్ వాల్ ఆర్ట్’ స్టూడియోలను వెతుక్కుంటూ వెళ్తున్నారు. ట్రైబల్ ఆర్ట్, టెంపుల్ ఆర్ట్, కొటేషన్స్.. అన్నీ మెటల్ వాల్ ఆర్ట్‌లో ఇమిడిపోతున్నాయి. ధరలు నాలుగు వేల నుంచి మొదలవుతాయి. కొత్తదనం కోరేవారికి తప్పక నచ్చుతాయి.