బాల్కనీలో తోటలనూ, కుండీల్లో మొక్కలనూ పెంచడం కాదు.. గోడల మీద ఏకంగా అడవుల్ని సృష్టించండి. అతిథులను ఆశ్చర్యానికి గురిచేయండి. ఇదీ ఓ కళే. ఓ చిన్న ఫ్రేమ్‌తో సరిపెడతారా, మొత్తం గోడకు విస్తరిస్తారా అన్నది మీ ఇష్టం.
‘మోస్ వాల్ ఆర్ట్’ ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్‌లో సరికొత్త ట్రెండ్. కార్పొరేట్ ఆఫీసుల ముస్తాబులోనూ భాగం అవుతున్నది. మొక్కలు, ఎండు కొమ్మలు, చిన్నచిన్న రాళ్లు, ఎండిన వేళ్లు, 0పూలు.. ఇవే ముడిసరుకు. అంత ఓపిక లేనివారికి ఆన్లైన్లో రెడీమేడ్‌గానూ దొరుకుతున్నాయి. వీటివల్ల ఇంటికి కొత్త అందం వస్తుంది. ఆహ్లాదంగానూ అనిపిస్తుంది.