ట్యాంకుల్లో ట్యాలెంట్!
ఆ పల్లెలో అడుగడుగునా అద్భుతాలే దర్శనమిస్తాయి. ఓ వీధిలోని ఇళ్లపైన విమానాలు ల్యాండవుతూ విస్తుగొలుపుతాయి. మరో వాడలోని మేడలపైన ఓడలు లంగరేసి కనిపిస్తాయి. డాబాలపై యుద్ధ ట్యాంకులు కవాతు చేస్తుంటే.. పక్క గల్లీలోని లోగిలిపై ట్రాక్టర్లు పొలం దున్నుతుంటాయి.
ఆ పల్లెలో అడుగడుగునా అద్భుతాలే దర్శనమిస్తాయి. ఓ వీధిలోని ఇళ్లపైన విమానాలు ల్యాండవుతూ విస్తుగొలుపుతాయి. మరో వాడలోని మేడలపైన ఓడలు లంగరేసి కనిపిస్తాయి. డాబాలపై యుద్ధ ట్యాంకులు కవాతు చేస్తుంటే.. పక్క గల్లీలోని లోగిలిపై ట్రాక్టర్లు పొలం దున్నుతుంటాయి. పంజాబ్లోని జలంధర్ శివారులో ఉన్న ఉప్పల గ్రామంలో.. ఇలాంటి వింతలెన్నో ‘ఔరా!’ అనిపిస్తాయి.

ఉప్పల గ్రామంలోని ఇళ్ల పైకప్పులపై సాధారణ ప్లాస్టిక్, సిమెంటు నీటి ట్యాంకులు ఉండవు. బదులుగా.. విమానం, యుద్ధ ట్యాంకులు, ఓడలు, గుర్రం, కారు, బస్సు మొదలైన విభిన్న ఆకారాలలోని ట్యాంకులు కనిపిస్తాయి. అవన్నీ జనాలను ఆకర్షించేలా, చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

ఒక్కరితో మొదలు..
ఈ తరహా ట్యాంకుల నిర్మాణం.. 1970వ దశకంలో మొదలైంది. అప్పట్లో విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి.. తన విమాన ప్రయాణానికి గుర్తుగా, ఇంటిపైన విమానం ఆకారంలో వాటర్ ట్యాంకును నిర్మించుకున్నాడు. అతణ్ని చూసి.. మరికొందరు అలాంటి నిర్మాణాలనే చేపట్టారు. అయితే, వారి వృత్తి, అభిరుచులకు అనుగుణంగా నీళ్ల ట్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ట్యాంకులను చూస్తే.. ఇంటి యజమాని వృత్తి ఏమిటో ఇట్టే తెలుస్తుంది.

యజమానికి ప్రతీక..
కేవలం అలంకరణ కోసమే ఇలాంటి ట్యాంకులను నిర్మించడం లేదు. ఆ ఇంటి యజమాని అభిరుచులు, వారి జీవిత విశేషాలకు ప్రతీకలుగా వాటిని ఎంచుకుంటున్నారు. తమ ఇళ్లు ప్రత్యేకంగా కనిపించాలని, తమ హోదాను, ఆశయాలను ఇతరులకు చాటిచెప్పాలని ఇలాంటి వినూత్న నిర్మాణాలను చేపడుతున్నారు. వ్యవసాయదారులు ట్రాక్టర్లు, పొలం పనులు చేస్తున్న రైతుల నమూనాలలో వాటర్ ట్యాంకులను నిర్మించుకుంటారు. విదేశాలకు వెళ్లినవారు విమానం, ఓడల ఆకారాలను ఎంచుకుంటారు.

సైన్యంలో పనిచేసిన వారు.. యుద్ధ ట్యాంకులను ట్యాంకర్లుగా మలుచుకుంటారు. క్రీడాకారులైతే.. ట్రోఫీలు, అభిమాన ఆటగాళ్ల బొమ్మలను; చరిత్రను ఇష్టపడేవారు రాజులు, యుద్ధాలకు సంబంధించిన బొమ్మలను ఏర్పాటు చేసుకుంటారు.

ఇక ఇంటి పైకప్పుపై సింహం, గుర్రం, ఏనుగు ఉన్నట్లయితే.. ఆ ఇంట్లోవారు జంతుప్రేమికులని అర్థం! మద్యం బాటిల్ ఆకారంలో ట్యాంకులు నిర్మించుకున్న మందుబాబులూ ఉన్నారిక్కడ.

పర్యాటక ఆకర్షణ
విచిత్రమైన వాటర్ ట్యాంకులతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఉప్పల గ్రామం. వింతైన నీటి ట్యాంకులను చూడటానికి దేశదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అందుకే ఈ ఊరికి ‘విమానాల గ్రామం’ అని పేరు కూడా వచ్చింది.

ఈ గ్రామానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. జలంధర్ కంటోన్మెంట్ – జండియాలా రోడ్డు మీదుగా సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. ఉప్పల గ్రామం వస్తుంది. పొలిమేర నుంచే తన ప్రత్యేకతను చాటుతుంటుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Jalandhar
- Punjab
- Roofs
- Uppal Khalsa
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

