కొప్పును నెట్‌తో సింగారించడం ఎప్పటినుంచో ఉన్నదే. బంగారు రంగులో మెరిసిపోతున్న ఈ హెయిర్ బన్ అందులో లేటెస్ట్ వెర్షన్. దారాలతో నేసినట్టు.. విభిన్నంగా కనిపించేలా తీర్చిదిద్దారు. కళాత్మక నగల తయారీ సంస్థ రోమా నర్సింఘాని, నేతన్నల బాగుకోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ రెహ్వా సంయుక్తంగా ఈ నగల కలెక్షన్‌ను రూపొందించాయి.
పాతకొత్తల మేళవింపుగా ఫ్యూజన్ డిజైన్‌తో తయారైన ఈ నగను రోమా నర్సింఘాని వెబ్సైట్లో అమ్మకానికి పెట్టారు. ధర రూ.8,034. చీరకట్టుకైనా, పట్టు లెహంగాకైనా.. అతికినట్టు సరిపోతుంది.. ఒట్టు!