Health Tips | ఇలా చేస్తే చాలా రోగాలకు చెక్ పెట్టొచ్చు!
ఈ రోజుల్లో వ్యాయామం దినచర్యలో భాగంగా మారిపోయింది. భారీ కసరత్తులు కాకపోయినా చాలామంది రోజూ వాకింగ్ తప్పనిసరిగా చేస్తున్నారు. ఉదయాన్నే క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే చాలా రోగాలకు చెక్ పెట్టొచ్చనేది నిపుణుల మాట. అయితే, ప్రతిరోజూ కనీసం 10వేల అడుగులు వేయాలని కొందరి వాదన.
Health Tips | ఈ రోజుల్లో వ్యాయామం దినచర్యలో భాగంగా మారిపోయింది. భారీ కసరత్తులు కాకపోయినా చాలామంది రోజూ వాకింగ్ తప్పనిసరిగా చేస్తున్నారు. ఉదయాన్నే క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే చాలా రోగాలకు చెక్ పెట్టొచ్చనేది నిపుణుల మాట. అయితే, ప్రతిరోజూ కనీసం 10వేల అడుగులు వేయాలని కొందరి వాదన.
అన్ని అడుగులు వేయాల్సిందేనా? ఎన్ని అడుగులు నడవాలి? నడకతో ఆరోగ్య ప్రయోజనాలు అంతగా ఉంటాయా? అని ఇంకొందరి సందేహం. రోజుకు 10వేల అడుగులు నడిస్తే ఆరోగ్యం మెరుగవుతుందన్నది పాత మాటే! 1965లో ఒక జపాన్ కంపెనీ తమ స్టెప్ మీటర్ విక్రయాలు పెంచుకోవడం కోసం ఈ ప్రకటన చేసిందట! ఈ సంగతి పక్కనపెడితే క్రమబద్ధమైన శారీరక శ్రమ ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు వైద్యులు.
మనం రోజువారీగా సుమారు ఐదు వేల నుంచి ఏడున్నర వేల అడుగులు వేస్తుంటాం. అయితే, రోజుమొత్తంలో ఐదువేల అడుగులు వేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. ఏకబిగిన ఐదారువేల అడుగులు వేయగలిగితే చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చని వైద్యులు చెబుతున్నారు. వారానికి కనీసం ఐదు రోజులు ఉదయం పూట ఆరువేల అడుగుల పైచిలుకు నడక సాగిస్తే.. శారీరకంగా, మానసికంగా గణనీయమైన మార్పులు ఉంటాయి. ఇక ఎందుకు ఆలస్యం ఆచితూచి అడుగేద్దాం పదండి!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

