పొద్దున నిద్ర లేవగానే పరుపుపై చెల్లాచెదురుగా ఉన్న బెడ్‌షీట్‌ను సర్దడం ఓ పెద్ద టాస్క్. బరువుగా ఉండే పరుపును ఎత్తి, దాని కిందికి దుప్పటిని దూర్చడం వల్ల చేతులు నొప్పులు పుట్టడమే కాకుండా.. కొన్నిసార్లు నడుంపై కూడా ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా వయసు మళ్లినవారికి ఇది చాలా కష్టమైన పని. ఈ ఇబ్బందులన్నీ తొలగించి, మీ బెడ్‌ను హోటల్ రూమ్‌లా నీట్‌గా మార్చేందుకు JIALTO బెడ్‌షీట్ టకర్ టూల్ వచ్చేసింది. ఇది ఓ చిన్న పెడల్ ఆకారంలో ఉండి, పరుపును ఎత్తాల్సిన అవసరం లేకుండానే బెడ్‌షీట్‌ను లోపలికి తోయడానికి ఉపయోగపడుతుంది. దీని హ్యాండిల్ పట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. జస్ట్.. షీట్ అంచున ఈ టూల్‌ను పెట్టి పరుపు కిందికి నెడితే చాలు. మీ చేతి వేళ్లకు దెబ్బ తగలకుండా, గోళ్లు విరిగిపోకుండా చాలా నీట్‌గా సర్దేయొచ్చు. స్ప్రింగ్ మ్యాట్రెస్ అయినా.. మెమొరీ ఫోమ్ అయినా.. ఏ రకమైన పరుపునకైనా ఇది భలేగా సెట్ అవుతుంది. దీంతో బెడ్‌మీద ముడతలు లేకుండా పక్కాగా సర్దుకోవచ్చు.
ధర: రూ. 199 (2 పీసులు)
దొరుకు చోటు: అమెజాన్

పిల్లల కోసమే ప్రత్యేకంగా, వారు సొంతంగా పాడుకుంటూ ఎంజాయ్ చేసేలా Storio మినీ కరోకే మెషిన్‌ను తయారుచేసింది. ఇది ఎంత చిన్నగా, తేలికగా ఉంటుందంటే.. ఐదేళ్ల పాప కూడా దీన్ని ఇట్టే పట్టుకుని తన రూమ్‌నే ఓ మినీ స్టేజ్లా మార్చేసుకోవచ్చు. ఈ బుజ్జి మెషిన్ చూడటానికి చిన్నగా ఉన్నా, దీని సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 5 నుంచి 6 గంటల పాటు నాన్‌స్టాప్‌గా పాటలు పాడుకోవచ్చు. దీనికి వచ్చే వైర్లెస్ మైక్ పిల్లలకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇక దీనికి ఉన్న రంగురంగుల ఎల్ఈడీ లైట్లు పార్టీ వాతావరణాన్ని మరింత కలర్ఫుల్గా మారుస్తాయి. బ్లూటూత్ ద్వారా దీన్ని ఫోన్‌కు కనెక్ట్ చేసి, పిల్లలకు ఇష్టమైన రైమ్స్ లేదా సాంగ్స్ ప్లే చేస్తూ వారు మైక్ పట్టుకుని పాడేలా చేయొచ్చు. ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా వారిలోని కళను బయటికి తీస్తుంది. పుట్టినరోజు వేడుకల్లో, ఫ్యామిలీ పార్టీల్లో పిల్లలను అలరించడానికి ఇది ఓ సూపర్ గిఫ్ట్ ఐడియా.
ధర: రూ. 1,099
దొరుకు చోటు: అమెజాన్

మంచం పైనుంచే వర్క్ చేయాలన్నా.. వీకెండ్స్‌లో హాయిగా సోఫాలో పడుకుని సినిమా చూడాలన్నా.. ల్యాప్‌టాప్‌ను ఒళ్లో పెట్టుకోవడం కొంచెం ఇబ్బందే. కాసేపటికే మెడ నొప్పి, నడుము నొప్పి వచ్చేస్తుంటాయి. ఇలాంటి సమస్యలు లేకుండా, మంచం మీదే ఓ మినీ ఆఫీసును సెట్ చేసుకునేలా SAIJI ల్యాప్‌టాప్ బెడ్టేబుల్ అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం టేబుల్ మాత్రమే కాదు, మీ కంఫర్ట్‌కు తగ్గట్టుగా మారిపోయే ఓ స్మార్ట్ గ్యాడ్జెట్. దీని ప్రత్యేకత ఏంటంటే.. దీని ఎత్తును నాలుగు లెవల్స్, నాలుగు యాంగిల్స్‌లో నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంతో మీ కళ్లకు నేరుగా ల్యాప్‌టాప్ స్క్రీన్ కనిపిస్తుంది, ఫలితంగా మెడపై ఒత్తిడి పడదు. 60×33 సెంటీమీటర్ల వెడల్పు ఉండటంతో 17 అంగుళాల పెద్ద ల్యాప్‌టాప్‌ను పెట్టినా, పక్కన మౌస్ వాడుకోవడానికి బోలెడు స్థలం ఉంటుంది. ఇందులో ఓ బుజ్జి డ్రాయర్ కూడా ఉంది. అందులో పెన్నులు, కేబుల్స్, ఫోన్ లాంటివి దాచుకోవచ్చు. పని పూర్తయ్యాక దీన్ని మడతపెట్టి మంచం కింద, సోఫా వెనుక ఇట్టే దాచేయొచ్చు. చదువుకునే స్టూడెంట్లకు, వర్క్ ఫ్రమ్‌హోమ్ చేసేవారికి ఇది ఓ సూపర్ గిఫ్ట్.
ధర: రూ. 4,500
దొరుకు చోటు: అమెజాన్ (ఆఫర్లను బట్టి మారుతుంది)

ఆఫీసు నుంచి రాగానే బ్యాగు ఎక్కడో.. కోటు ఇంకెక్కడో పడేస్తుంటాం. సాయంత్రం బయటికి వెళ్లేటప్పుడు గొడుగు కోసం వెతుకుతాం. ఇలా ఏదైనా వస్తువు సమయానికి దొరక్కపోయినా.. గదిలో చెల్లాచెదురుగా ఉంటే చూడటానికి అస్సలు బాగుండదు. ఈ సమస్యకు చెక్ పెడుతూ, మీ గదికి ఓ కొత్త లుక్ కూడా రావాలంటే.. House of Quirk కోట్ రాక్‌ను కొనేస్తే సరి. ఇది మీ వస్తువులను పద్ధతిగా సర్దుకోవడానికి ఓ చక్కని పరిష్కారం. దీనికి ఏకంగా 12 హుక్స్ ఉన్నాయి. ఇది స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారైంది కాబట్టి చాలా బలంగా ఉంటుంది. దీనికి మూడు వైపులా ఉన్న కాళ్లు ఎంత బరువునైనా తట్టుకుని.. స్థిరంగా నిలబడేలా చేస్తాయి. పైన ఉండే హుక్స్, కింద ఉన్న హుక్స్ కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. అంటే.. వాటిని టోపీలు లేదా చిన్న వస్తువుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారన్నమాట. దీన్ని సెట్ చేయడం చాలా సులభం. ఓ చిన్న
స్క్రూ డ్రైవర్‌తో నిమిషాల్లోనే అమర్చేయొచ్చు. తక్కువ స్థలం ఉన్నచోట భలేగా సెట్ అవుతుంది.
ధర: రూ. 1,999 దొరుకు చోటు: అమెజాన్
(ఆఫర్లను బట్టి మారుతుంది)