వేసవి కదా అని వేడుకలు రాకుండా ఉండవు. ఉక్కగా ఉందని చక్కటి డ్రెస్సులు వేసుకోకుండా ఉండటమూ కుదరదు. అంతంత మాత్రం అలంకరణ అసలే వీలుపడదు. అలాంటప్పుడు అందంగా, అంతే తేలికగా ఉండే బట్టలుంటే బాగుంటుంది అనిపిస్తుంది.
ఇక్కడ అందాల తార సదా సరదాగా ధరించింది అలాంటి డ్రెస్సే. పీచ్ రంగులో ఆర్గంజా, క్రేప్ వస్ర్తాల మేళవింపుగా తీర్చిదిద్దారు. అద్దాలూ పూసలతో హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన అనార్కలీ టాప్, బంగారు రంగు లేస్ అంచు వేసిన ప్యాంట్.. సమ్మర్ సంగీత్‌కు సూపర్ సెట్… అంతేగా?!