పుట్టుకతోనే స్పష్టమైన తేడా..
సాధారణంగా ఆడవాళ్లు-మగవాళ్లు.. వేర్వేరు ఆసక్తులు, అభి రుచులను కలిగి ఉంటారు. అమ్మాయిలు భావోద్వేగ బంధాలు, సామాజిక సంబంధాల పట్ల మక్కువ చూపుతారు. అదే, అబ్బాయిలు రిస్క్ తీసుకోవడం, పోటీతత్వం, శారీరక శ్రమతో కూడిన పనుల పట్ల ఆసక్తి కనబరుస్తారు. దీనివెనక తల్లిదండ్రుల పెంపకం, చుట్టూ ఉన్న సమాజం అధిక ప్రభావం చూపుతుందనేది అందరూ చెప్పే మాట. కానీ, నవజాత శిశువులపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఒక సరికొత్త అధ్యయనం.. కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.

తల్లిదండ్రులు, సమాజ ప్రభావం పడకముందే.. లింగ బేధాన్ని బట్టి శిశువుల ఆసక్తులలో తేడాలు ఉన్నట్లు ఈ పరిశోధన తేల్చింది. ఇందుకు సంబంధించిన విషయాలను ‘బయాలజీ ఆఫ్ సెక్స్ డిఫరెన్సెస్’ జర్నల్ ప్రచురించింది. అధ్యయనంలో భాగంగా కేంబ్రిడ్జ్ పరిశోధకులు.. 130 మంది శిశువులకు ఒకే సమయంలో రెండు రకాల వీడియోలను చూపించారు. అందులో ఒకటి సహజంగా కదులుతున్న మానవ ముఖం కాగా.. మరొకటి గురుత్వాకర్షణ శక్తితో ఊగే మెటాలిక్ బాల్స్. ఆసక్తికరంగా, పుట్టిన వెంటనే ఆడపిల్లలు మానవ ముఖాన్ని చూడటానికి ఎక్కువ సమయం కేటాయించినట్లు పరిశోధకులు గుర్తించారు.
అదే మగపిల్లలు కదిలే వస్తువులపై అధికంగా ఆసక్తి చూపుతున్నట్లు కనుగొన్నారు. గర్భధారణ సమయంలో లింగాల మధ్య ఉండే జీవసంబంధిత తేడాలు శిశువుల దృష్టిని ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు అంటున్నారు. వ్యక్తుల లక్షణాలకు జన్యువులు, పరిసరాలు ఎంతవరకు కారణం అనే చర్చకు ఈ ఫలితాలు సమాధానం ఇస్తున్నాయని పేర్కొంటున్నారు. అయితే, పుట్టుకతో వచ్చే ఈ లింగ వ్యత్యాసాలు ప్రారంభ దశకు మాత్రమే పరిమితమని పరిశోధకులు చెబుతున్నారు. భవిష్యత్తులో పిల్లలు ఎలా నేర్చుకుంటారు? ఎలా ఎదుగుతారు? అనేదాన్ని ఈ తేడాలు పూర్తిగా నిర్ధారించలేవని స్పష్టం చేస్తున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్