అదిరే ఫీచర్లతో సిగ్నేచర్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా.. టెక్నాలజీ ప్రియులను ఆకట్టుకునేలా సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నది. అద్భుతమైన కెమెరా టెక్నాలజీ, శక్తిమంతమైన ప్రాసెసర్, సరికొత్త డిజైన్‌తో.. ‘మోటోరోలా సిగ్నేచర్ 27’ని రూపొందించింది. టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారిన ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇందులో 6.8 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ LTPO AMOLED డిస్ప్లేను ఏర్పాటు చేశారు. గేమింగ్, స్మూత్ స్క్రోలింగ్ అనుభూతి కోసం 165Hz రిఫ్రెష్ రేట్ అందిస్తున్నారు.

ఇక అత్యుత్తమ పనితీరు కోసం.. ఈ ఫోన్లో శక్తిమంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 చిప్‌సెట్‌తోపాటు 12 జీబీ LPDD R6 ర్యామ్‌ను అమర్చారు. మరోవైపు ఫొటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకునేలా.. హై-ఎండ్ కెమెరా సెటప్ తీర్చిదిద్దారు. 50 మెగాపిక్సెల్ సోనీ మెయిన్ సెన్సర్‌తో పాటు, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ (30ఎక్స్ ఆప్టికల్ జూమ్, 100ఎక్స్ డిజిటల్ జూమ్) ఏర్పాటు చేశారు. అల్ట్రావైడ్ కోసం మరో 50 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ముందుభాగంలో50 మెగాపిక్సెల్ కెమెరాను పొందుపరిచారు. రోజంతా నిరంతరంగా వాడేందుకు వీలుగా 6000 ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 90W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది.
సంగీతాన్ని ఇష్టపడేవారి కోసం.. ప్రముఖ ఆడియో ‘బ్రాండ్ బాంగ్ – ఓలుఫ్సన్’ సౌండ్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లతో అద్భుతమైన సౌండ్ అనుభూతిని పొందొచ్చని మోటరోలా ప్రతినిధులు చెబుతున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 68/ఐపీ 69 రేటింగ్ లాంటి భద్రత ఫీచర్లనూ అందిస్తున్నారు. భారత మార్కెట్లో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్) ధర రూ. 89,999 వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్