బాలీవుడ్ తార సోనమ్ కపూర్‌కు ఫ్యాషన్ ప్రపంచంలో మంచి ఫాలోయింగ్ ఉంది. నయా మాడల్స్‌తో తళుక్కుమనడం ఈ సుందరికి మామూలే! తాజాగా డెనిమ్ రగ్గ్డ్ లుక్‌లో కనిపించి అదరగొట్టింది. ఆలివ్ గ్రీన్ రంగు బ్లేజర్‌కు జతగా అదే కలర్ ప్యాంట్ ధరించి ఫొటోలకు పోజిచ్చింది.
డెనిమ్ క్వీన్‌గా అందరి మనసులూ దోచేసింది. ఈ చిత్తరువులు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయగానే వైరల్ అయ్యాయి. రా లుక్‌లో రిచ్‌గా కనిపిస్తున్న సోనమ్‌కు సాహో అంటున్నారు అభిమానులు.