ఫ్లాట్ అవ్వాల్సిందే!
కొన్ని దుస్తులు, ఇంకొన్ని ఆభరణాలు, మరికొన్ని యాక్సెసరీస్.. చూడగానే ఫ్లాట్ అయిపోతాం. మనవే అనిపించుకునేదాకా కుదుటపడదు మనసు. కానీ ఎప్పుడూ మనమే ఫ్లాట్ అవ్వడం కాదు, మనకోసం ఫ్లాట్ అయిపోయే నగలూ ఉన్నాయి. అవే.. ‘ఫ్లాట్ చెయిన్ నెక్లెస్'లు. విభిన్న పెండెంట్లు, రకరకాల డిజైన్లతో తయారవుతున్నాయీ కంఠాభరణాలు.
కొన్ని దుస్తులు, ఇంకొన్ని ఆభరణాలు, మరికొన్ని యాక్సెసరీస్.. చూడగానే ఫ్లాట్ అయిపోతాం. మనవే అనిపించుకునేదాకా కుదుటపడదు మనసు. కానీ ఎప్పుడూ మనమే ఫ్లాట్ అవ్వడం కాదు, మనకోసం ఫ్లాట్ అయిపోయే నగలూ ఉన్నాయి. అవే.. ‘ఫ్లాట్ చెయిన్ నెక్లెస్’లు. విభిన్న పెండెంట్లు, రకరకాల డిజైన్లతో తయారవుతున్నాయీ కంఠాభరణాలు.
అందంగా ఉండటం, విభిన్నంగా కనిపించడం… కొత్త నగకు ఉండాల్సిన ముఖ్య లక్షణాలు. ఈ రెండూ ఉంటేనే మహిళాబోర్డు పరీక్షలో మంచి మార్కులు పడతాయి ఆభరణానికి. అప్పుడే వాటి కరిక్యులమ్ వీటాకి బలం కూడా. మలి రౌండ్లో నెగ్గుకొచ్చి మార్కెట్ జోరును అందుకునే అవకాశమూ వాటికే. అచ్చంగా ఆ అర్హతలన్నీ ఉన్నాయి ఫ్లాట్ మెష్ చెయిన్ నెక్లెస్లకు. మెడను అలంకరించే గొలుసు పల్చగా, వెడల్పుగా ఉండటం ఇందులోని ప్రత్యేకత. అంటే సాధారణంగా మనం చూసే గొలుసుల్లా గుండ్రం గానో, డిజైన్లతో ఉబ్బెత్తుగానో కాకుండా.. చదరంగా ఉండటం వల్ల ఇవి ఫ్లాట్ నెక్లెస్‌లు అయ్యాయన్నమాట. పై మెడకు పెట్టుకునేలా చోకర్ తరహాతో పాటు, ఇంకాస్త కిందికి ధరించే నెక్లెస్‌లా కూడా రూపొందుతున్నాయి. సాదా చెయిన్‌కు పెద్ద పెండెంట్… దానికి సరిపోయే జుంకాలతో వచ్చేవి కొన్నయితే, గొలుసు మీద మామిడి పిందెలు, పువ్వుల్లాంటి బంగారు మోటిఫ్స్‌తో వచ్చేవి మరికొన్ని. లాకెట్లలో సంప్రదాయ డిజైన్లలో కనిపించే నెమళ్లూ, లక్ష్మీదేవి రూపుల్లాంటివీ ఉంటున్నాయి. బంగారంలో వజ్రాలు, రత్నాలు, ముత్యాలు పొదిగి చూడముచ్చటైన డిజైన్లలో దొరుకుతున్నాయి కూడా. చెయిన్ వెనుక హుక్ పెట్టుకునే భాగంలో డిజైన్లు వచ్చేలా ప్రత్యేకంగానూ తయారు చేస్తున్నారు. ఫ్లాట్ నెక్లెస్ మిమ్మల్నీ ఫ్లాట్ చేసిందా?
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Accessories
- clothes
- Jewelry
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

