రోజంతా పరిమళిద్దాం!
శరీరాన్ని అందంగానే కాదు, సువాసన వెదజల్లేలా ఉంచుకోవడం కొందరికి ఇష్టం. తాజాగా ఉన్న అనుభూతిని ఇచ్చి రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు ఇది సహకరిస్తుంది.
శరీరాన్ని అందంగానే కాదు, సువాసన వెదజల్లేలా ఉంచుకోవడం కొందరికి ఇష్టం. తాజాగా ఉన్న అనుభూతిని ఇచ్చి రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు ఇది సహకరిస్తుంది. అలాగని ఘాటైన అత్తర్లు రాసేస్తే సరిపోతుంది అనుకోవడానికి లేదు. అలాంటివి ఎదుటివారిని ఇబ్బంది పెట్టవచ్చు కూడా. మనకు మన చుట్టుపక్కల వారికి కూడా హాయిగొలిపేలా రోజంతా శరీరం సువాసన వెదజల్లేందుకు నాలుగు సూత్రాలను సూచిస్తున్నారు చర్మ నిపుణులు.
పర్ఫ్యూమ్ వేసుకునే ముందు సువాసన వెదజల్లే బాడీ లోషన్ లేదా క్రీమ్‌ని శరీరానికి రాయాలి. తర్వాత అరచేతి పైన నాడులుండే చోట, మెడ, చెవుల వెనుక పర్ఫ్యూమ్ని ఐప్లె చేయడం వల్ల శరీరం నుంచి ఎక్కువసేపు మంచి వాసన వస్తుంటుంది.
స్నానం చేసేటప్పుడు చెమట వచ్చే శరీర ప్రాంతాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అలాగే చర్మం మీద మృతకణాలను తొలగించేలా స్క్రబ్ లేదా మాస్క్‌ల లాంటివి వేసుకుంటూ ఉండాలి.
చర్మ రంధ్రాలను మూసేయకుండానే, చెమట వాసన రాకుండా చేసే డియోడరెంట్లను ఎంచుకోవాలి. రసాయనాలు తక్కువగా ఉండి, సెన్సిటివ్ చర్మానికి కూడా పనికొచ్చేవాటిని వాడాలి. అలాగే స్నానం చేసిన వెంటనే చర్మాన్ని పొడిగా తుడిచి డియోడరెంట్ రాయడం వల్ల ఎక్కువసేపు తాజాగా ఉన్న అనుభూతి కలుగుతుంది.
ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికిన దుస్తులనే వేసుకుంటూ ఉండాలి. దుస్తుల అరల మధ్య ఎండిన లావెండర్, లేదా ఇతర సుగంధం వెదజల్లే సహజ మూలికలను ఉంచడం వల్ల వస్ర్తాలు కూడా పరిమళభరితంగా మారతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

