ఇల్లు తీసుకోగానే సరిపోదు. అందులో అదిరిపోయే ఇంటీరియర్స్ ఉంటేనే అందం. వినియోగదారుల ఆలోచనలకు తగ్గట్టే ఇంటీరియర్ డిజైన్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులను నవతరం సాదరంగా ఆహ్వానిస్తున్నది. ఇంటిని ముస్తాబు చేయడంలో చాలామంది ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ మేరకు డిఫరెంట్ ఫర్నిచర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ట్రెండ్‌లో ఉన్న డిజైన్లతోపాటు కొత్త ఐడియాలజీతో నచ్చినట్టుగా ఇంటిని మలుచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్లపై ఓ లుక్కేద్దాం..

రౌండెడ్ ఫర్నిచర్: గృహాలంకరణలో భాగంగా చాలామంది స్ట్రెయిట్ లైన్స్, కర్డ్వ్ ఫినిషింగ్ ఫర్నిచర్‌ని ఉపయోగిస్తుంటారు. రౌండ్, ఓవల్ షేప్ ఫర్నిచర్‌కు అందరూ ఓటేయరు. అయితే తాజాగా రౌండ్ షేప్ ట్రెండ్ సృష్టిస్తున్నది. సోఫా, డైనింగ్ టేబుల్ నుంచి ఆరామ్ చెయిర్ వరకు అన్నీ గుండ్రంగా ఉంటే మరింత ఆకర్షణీయంగా మారతాయి. మార్కెట్లో కూడా రౌండెడ్ షేప్ ఫర్నిచర్ సులువుగానే అందుబాటులో ఉంటున్నది.
లైట్ కలర్ ఉడ్: ఒక్కో కలపకు బేస్ షేడ్ వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు టేక్, మహాగని మొదలైన కలప ముదురు రంగులో ఉంటాయి. అలాగే మ్యాపెల్, రబ్బర్ ఉడ్ లేతరంగుల్లో ఉంటాయి. ఇప్పుడు చాలామంది లేతరంగు కలపకే మొగ్గు చూపుతున్నారు. రిచ్ లుక్‌తోపాటు ఈ తరహా కలప ధర తక్కువగా ఉండటం కూడా లేతరంగులపై మోజుకు కారణమవుతున్నది. లైట్ కలర్ ఫర్నిచర్‌తో స్టయిలిష్ లుక్ తీసుకొస్తున్నారు. అంతేకాదు, ఫ్లోరింగ్ విషయంలోనూ లైట్కలర్ ఉడెన్కు ప్రాధాన్యం ఇస్తున్నారు.
గ్రాండ్ మిల్లీనియల్ ైస్టెల్: పాతతరం కలెక్షన్లకు పెట్టింది పేరు ఈ ైస్టెల్. ఇందులో వాడే ఫర్నిచర్ బోరింగ్‌గా కనిపించినా, ఒక నోస్టాల్జిక్ భావనను కలిగిస్తుంది. సంప్రదాయాలకు పెద్దపీట వేసేవారికి ఈ గ్రాండ్ మిల్లీనియల్ ైస్టెల్ బాగా నచ్చుతుంది. మార్కెట్లో వింటేజ్ కలెక్షన్ అందుబాటులో ఉంటున్నది. ఉదాహరణకు ఆరామ్ కుర్చీ, స్కర్టెడ్ డ్రెస్సింగ్ టేబుల్ మొదలైనవి ఇంటీరియర్‌ని అందంగా మారుస్తాయి.

Feature Imae
ఎకో-ఫ్రెండ్లీ డిజైన్: ప్రకృతి ఎంత అందమైనదో మనకు తెలుసు. అయినా టెక్నాలజీ, ఫ్యాషన్ పేరుతో అన్ని విషయాల్లోనూ ప్రకృతిని నాశనం చేస్తున్నాం. కాలంతోపాటు పర్యావరణ స్పృహ పెరుగుతున్నది. ఈ మేరకు అభిరుచుల్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఇంటీరియర్‌లోనూ ఎకో ఫ్రెండ్లీ డిజైన్ని ఎంచుకుంటున్నారు. ధర ఎక్కువే అయినా ఇంటి అలంకరణ వస్తువుల్లో ప్లాస్టిక్‌కు బదులుగా కలపకే పెద్ద పీట వేస్తున్నారు. బ్యాంబూ, కేన్‌తో తయారైన ఇంటీరియర్స్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు వినియోగదారులు.
80ల కాలంనాటి రెట్రో: డిస్కో లైట్ల నుంచి ఆర్చీల వరకు మళ్లీ 1980ల నాటి డిజైన్స్‌కు పూర్వవైభవం వస్తున్నది. ఆర్కిటెక్చరల్ ఆర్చీలను ఇంట్లో పెట్టుకుంటే మరింత అందంగా ఉంటుంది. అలాగే మెటాలిక్ లైట్లు, వాల్పేపర్లతో కూడిన ఫాక్స్ ఆర్చీలు, పాతతరం కిటికీలు ఇంటిని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.

Dandy Sofa

Youth1