పొదుపు గెలుపు
పొదుపు గురించి స్త్రీలకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పాల్సిన పనిలేదు. ఖర్చులు అదుపు చేయడంలో, పైకాన్ని మదుపు చేయడంలో వాళ్ల శైలి ప్రత్యేకం. పర్పస్ లేకుండా పర్సులో డబ్బులు దాచుకుంటే అది పొదుపు అనిపించుకోదు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా చిన్నమొత్తం దాచుకున్నా... పెద్ద ప్రయోజనం ఉండాలి.
పొదుపు గురించి స్త్రీలకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పాల్సిన పనిలేదు. ఖర్చులు అదుపు చేయడంలో, పైకాన్ని మదుపు చేయడంలో వాళ్ల శైలి ప్రత్యేకం. పర్పస్ లేకుండా పర్సులో డబ్బులు దాచుకుంటే అది పొదుపు అనిపించుకోదు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా చిన్నమొత్తం దాచుకున్నా… పెద్ద ప్రయోజనం ఉండాలి.
అన్నిటినీ మించి ఆదాయానికి అనుగుణంగా ఖర్చులను నియంత్రించడం మొదట చేయాల్సిన పని. నెలవారీ ఆదాయంలో 20 శాతం వరకైనా ఆదా చేయగలిగితే ఏడాదికి నికరంగా రెండున్నర నెలల జీతం చేతిలో ఉంటుంది. అలాగని ఇంటి అవసరాలు, పిల్లల సరదాలు, మీ ఇష్టాలను త్యాగం చేయాలనుకోవడం సరికాదు. స్వల్పకాలిక లక్ష్యాలను ఎంచుకొని పొదుపు మంత్రం పఠించాలి. దీర్ఘకాలిక అవసరాల కోసం మదుపు తంత్రం ఎంచుకోవాలి.
లాంగ్‌టర్మ్ గోల్స్ కోసం స్టాక్‌మార్కెట్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బంగారం కొనుగోలు వంటి వాటిపై పెట్టుబడి పెట్టడం మంచిది. మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు పలు బ్యాంకులు ప్రత్యేక ఖాతాలు, వడ్డీరేట్లను కూడా అందిస్తున్నాయి. ఇంటి నెలవారీ బడ్జెట్లో మిగిలిన మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమచేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా పొదుపు మొదలుపెట్టండి!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- market
- savings
- Stockmarket
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

