Food | జంక్‌ఫుడ్ వల్ల ఎంత హాని కలుగుతుందో.. సంప్రదాయ ఆహారంతో కూడా..
మనది సంప్రదాయ రుచులను ఇష్టపడే దేశం. అందుకే నూడుల్స్, బ్రెడ్ ఎంతగా లభిస్తున్నాయో... కారప్పూస, మరమరాలు లాంటి సంప్రదాయ ఆహారానికి కూడా అంతే డిమాండ్ ఉంది. అయితే ఇక్కడ ఓ తిరకాసు ఉంది. సంప్రదాయ రుచులు అయినంత మాత్రాన అవి ఆరోగ్యకరం అనుకోవడానికి లేదు.
Food | మనది సంప్రదాయ రుచులను ఇష్టపడే దేశం. అందుకే నూడుల్స్, బ్రెడ్ ఎంతగా లభిస్తున్నాయో… కారప్పూస, మరమరాలు లాంటి సంప్రదాయ ఆహారానికి కూడా అంతే డిమాండ్ ఉంది. అయితే ఇక్కడ ఓ తిరకాసు ఉంది. సంప్రదాయ రుచులు అయినంత మాత్రాన అవి ఆరోగ్యకరం అనుకోవడానికి లేదు.
పామ్ ఆయిల్, మైదా, కృత్రిమ రంగులు లాంటి ఎన్నో హానికారక పదార్థాలు ఈ తరహా ప్యాక్డ్ ఫుడ్స్‌లో ఉండవచ్చు. పాశ్చాత్య జంక్‌ఫుడ్ వల్ల ఎంత హాని కలుగుతుందో, వీటి వల్లా అంతే ప్రమాదం ఉంది. రాజస్థాన్‌కు చెందిన అహానా గౌతం ఈ విషయాన్ని చాలా త్వరగానే గ్రహించారు. అందుకు పరిష్కారం గురించి ఆలోచించారు. ఐఐటిలో చదివిన అహానా ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూనే, ఈ సవాలుకు మార్గం కనుగొనే ప్రయత్నం చేశారు.
అలా మొదలైందే ‘ఓపెన్ సీక్రెట్’. సంప్రదాయ చిరుతిళ్లను అందించే ఈ సంస్థ తన ఉత్పత్తులలో ఏముందో చాలా స్పష్టంగా పేర్కొంటుంది. మనకు ఇష్టమైన చిరుతిళ్లను వదులుకోవడం మార్గం కాదు! వాటిని ఆరోగ్యకరమైన రీతిలో తీసుకోవడమే పరిష్కారం అంటారు అహానా! దానికి అనుగుణంగా ‘ఓపెన్ సీక్రెట్’ నిర్వహిస్తున్నారు. రుచికరమైన ఈ సంస్థ ఉత్పత్తులకు అనతి కాలంలోనే మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా రూ.వంద కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతున్నది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- eat
- Food
- Read
- Read and eat
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

