మలి సందె ముగిశాక, సూరీడు కొండల మాటున నిద్దురోయాక, ఆకాశాన్ని అలుముకున్న నలుపు రంగు ఎన్నో మదుల్లో గులాబీలు పూయిస్తుంది. ఆ యామిని అందానికి భామిని వయ్యారాన్నీ కలగలుపుకొన్నట్టు ఇరువన్నెల ముస్తాబులో మరులుగొలుపుతున్నది అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్.
నలుపు, గులాబీ వర్ణాల్లోని వీనెక్ మ్యాక్సీ డ్రెస్‌కు జోడీగా, బ్లాక్ అండ్ వైట్ చోకర్ కాలర్ ధరించిందామె. అవే వన్నెల్లో ఉన్న జోడు ఉంగరాలు గొలుసుకు మంచి జోడీ అనిపిస్తున్నాయి. మొత్తానికి హాట్ లుక్స్‌తో కుర్రకారు గుండెల్లో గులాబీల ముళ్లు గుచ్చుతున్నదీ ముద్దుగుమ్మ!