అంటే నల్ల చొక్కాకు పెద్ద బ్రూచ్, సాదా కుర్తీకి ప్రత్యేకమైన బ్యాగ్, సింపుల్ చీరకు బోల్డ్ నగ, రెగ్యులర్ టాప్‌పైకి పెద్ద బెల్ట్… ఇలా ఘనంగా ప్రత్యేకంగా కనిపించే వస్తువుల్ని మన దుస్తులకు జత చేయడం ద్వారా మరింత ఫ్యాషనబుల్‌గా కనిపించడం ఇందులోని ప్రత్యేకత. ఇలా లుక్‌ని మార్చే నగ లేదా యాక్సెసరీలను ‘పవర్ పీస్’లుగా పిలుస్తున్నారు. ఇందుకోసం మనం ప్రత్యేకంగా ప్రతిసారీ షాపింగ్ ఏం చేయక్కర్లేదు. ఆ రోజు మనం ధరించిన వస్ర్తాలను బట్టి మన వార్డ్‌రోబ్‌లో నుంచి ఏది పవర్ పీస్‌గా పనికొస్తుందో చూసి ఎంచుకుంటే సరి! మరి ఈ సారి పార్టీకి మీరూ ‘పవర్ ఫుల్’గా రెడీ అయిపోతారా?!

Belt