మేటి మహిళ.. టేలర్ స్విఫ్ట్
టైమ్ మ్యాగజైన్ ముఖచిత్రంగా కనిపించడమే ఓ జీవితకాల విజయం, అతిగొప్ప అనుభవం. అదనంగా ‘ఈ ఏటి మేటి వ్యక్తి’గా గుర్తిస్తే.. చెప్పేదేముంది? ఆ అరుదైన ఖ్యాతిని దక్కించుకున్నారు ప్రముఖ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్. తన పన్నెండో ఏట అనుకోకుండా సంగీత ప్రపంచంలో అడుగుపెట్టిన టేలర్... ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.
టైమ్ మ్యాగజైన్ ముఖచిత్రంగా కనిపించడమే ఓ జీవితకాల విజయం, అతిగొప్ప అనుభవం. అదనంగా ‘ఈ ఏటి మేటి వ్యక్తి’గా గుర్తిస్తే.. చెప్పేదేముంది? ఆ అరుదైన ఖ్యాతిని దక్కించుకున్నారు ప్రముఖ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్. తన పన్నెండో ఏట అనుకోకుండా సంగీత ప్రపంచంలో అడుగుపెట్టిన టేలర్… ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఆమె గాత్రానికి లోకమంతా దాసోహమంది. అందుకు తాజా సాక్ష్యం.. టేలర్ ఈ ఏడాది మొదలుపెట్టిన ‘ఎరాస్ టూర్’.
ఈ యాత్రలో అడ్వాన్స్ టికెట్లే 100 మిలియన్ డాలర్లను సంపాదించి పెట్టాయి. టేలర్‌ను ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా గుర్తిస్తూ రాసిన వ్యాసంలో టైమ్ పత్రిక ‘తన చరిత్రను తానే లిఖించుకున్న అరుదైన వ్యక్తి టేలర్’ అని కీర్తించింది. ‘ఎరాస్ టూర్’ సాధారణ కచేరీ కాదు. కొన్ని గంటల పాటు ప్రేక్షకులకు ఏకబిగిన ఆటపాటలను, వినోదాన్ని అందిస్తుంది. ఈ తరహా ప్రదర్శనను ‘కాన్సర్ట్ ఫిల్మ్’ అంటారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

