రామ సుందరుణ్ని తరలి రమ్మంటూ ‘సీతారామం’ సినిమాలో సీత చేసిన అభినయం ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఆమె అందానికీ, నటనకూ జనం ఫిదా అయ్యారు. ఆపై ‘హాయ్ నాన్నా’ అంటూ మరోసారి పలకరించి, హిట్టు కొట్టింది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. లేత పచ్చ వన్నెలోని బ్లేజర్ సూట్ సెట్లో ఫొటోకి పోజిచ్చి చీరైనా, ప్యాంటైనా… క్లాసిక్ లుక్లో తగ్గేదేలే అంటున్నది.