నా పాప నాకు దూరమౌతుందేమో.. ఏం చేయాలి?
నా వయసు 30 ఏండ్లు. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చాను. పాపకు నాలుగు నెలలు నిండాయి. మెటర్నెటీ లీవ్ కాలపరిమితి ముగియడంతో తిరిగి విధుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాప బాగోగులు చూసుకునేందుకు మా అత్తగారు వచ్చారు! ఆమె వయసులో పెద్దావిడ.
నా వయసు 30 ఏండ్లు. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చాను. పాపకు నాలుగు నెలలు నిండాయి. మెటర్నెటీ లీవ్ కాలపరిమితి ముగియడంతో తిరిగి విధుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాప బాగోగులు చూసుకునేందుకు మా అత్తగారు వచ్చారు! ఆమె వయసులో పెద్దావిడ. పిల్లల పెంపకంలో అనుభవం ఉన్నప్పటికీ, నాకు కంగారుగానే ఉంది. పాప నన్ను మిస్ అవుతుందనీ, తనతో ఎక్కువ సమయం గడపకపోతే.. నాకు దగ్గరవ్వదేమో అని భయంగా ఉంది. ఈ పరిస్థితిలో నన్నేం చేయమంటారు?
– ఓ పాఠకురాలు
మాతృత్వ మాధుర్యం అనుభూతి చెందుతున్న ప్రతి అమ్మలోనూ ఇలాంటి అనుమానాలు రేకెత్తడం సహజం. నాలుగు నెలలుగా పాపతోనే ఉండటం వల్ల.. తనను వదిలి ఆఫీసుకు వెళ్లడానికి మీకు ధైర్యం సరిపోవడం లేదు. మీ అత్తగారు బాగా చూసుకుంటారని తెలిసినా.. బుజ్జాయిని వదిలి ఉండటానికి మీ అంతరాత్మ అంగీకరించడం లేదు! ముఖ్యమైన విషయం ఏంటంటే.. పొద్దంతా తన దగ్గర లేకపోతే, చిన్నారి మీకు దూరమవుతుందన్నది కేవలం మీ అపోహ మాత్రమే! పాపతో మీది రక్తసంబంధం.
ఒక పూట దగ్గర లేనంత మాత్రాన ఏదో జరిగిపోతుందని కంగారుపడొద్దు. ఎవరు ఎంత దగ్గర చేసినా అమ్మ ఆప్యాయతను మించింది ఉండదు! అవకాశం ఉంటే పని వేళలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కొన్నాళ్లు రిమోట్ వర్క్ గానీ, హైబ్రిడ్ వర్క్ ఆప్షన్ గానీ ఇవ్వమని కోరండి. అందుకు అవకాశం లేకపోతే.. మీ ఆఫీస్‌కు దగ్గరగా ఇల్లు తీసుకుంటే ప్రయాణ సమయం కూడా కలిసివస్తుంది. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకండి. ఇంట్లో ఉన్న సమయం పాపతో
గడపడానికి ప్రాధాన్యం ఇవ్వండి. పాపకు ఏడాది వయసు వచ్చే దాకా, అందుబాటులో ఉన్న సెలవులను వాడుకోండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

