ఈ తరం పిల్లలకు గానుగ అంటే అదేంటో అర్థం కాదు. హైదరాబాద్ శివారులో గానుగ మరను మనిషి తిప్పుతూ చెరకు రసం తీసిస్తుంటే.. వింతగా చూస్తుంటారు. అదే గానుగ ద్వారా నూనె ఉత్పత్తి అవుతుందని చెబితే నమ్మడం కష్టమే! సహజ సిద్ధంగా చెక్క గానుగ (ఎద్దుల గానుగ) ద్వారా నూనె తీసే దృశ్యాన్ని చూపిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. భూపాలపల్లి మండల కేంద్రంలోని గిరిజన ఆముదాలపల్లిలో ఎద్దుల గానుగ పొద్దస్తమానం ఆడుతూనే కనిపిస్తుంది.
గ్రామానికి చెందిన బౌతు రాజు, అశ్విని దంపతులు దీనిని నిర్వహిస్తున్నారు. రోజుకు 20 లీటర్ల నూనె ఉత్పత్తి చేస్తున్నారు. పల్లినూనెతో పాటు కొబ్బరినూనె, కుసుమనూనె, ఇప్పనూనె తయారు చేస్తున్నారు. కల్తీలేని సహజసిద్ధమైన నూనె విక్రయిస్తూ, అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.30 వేల వరకూ ఆదాయం ఆర్జిస్తున్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఇటీవల ఆముదాలపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా రాజు ఇంటికీ వచ్చారు. దీంతో ఈ గానుగ నూనె కేంద్రం ప్రచారంలోకి వచ్చింది.
…? తిరుపతి