డెంగ్యూ నుంచి త్వరగా బయటపడేసే ఈ ఫుడ్ ఐటమ్స్ మీకు తెలుసా..?
Food items for Dengue | ప్రతి ఏడాది భారీ సంఖ్యలో జనం డెంగ్యూ బారిన పడుతున్నారు. డెంగ్యూ దోమల సంతతి పెరగడానికి నిలువ నీరు
Food items for Dengue: ప్రతి ఏడాది భారీ సంఖ్యలో జనం డెంగ్యూ బారిన పడుతున్నారు. డెంగ్యూ దోమల సంతతి పెరగడానికి నిలువ నీరు కారణమవుతున్నది. ఒకవేళ మీరు డెంగ్యూ బారినపడితే తిరిగి కోలుకునే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. మీరు ఎంత త్వరగా డెంగ్యూ నుంచి కోలుకుంటారనేది మీరు తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెంగ్యూ బారీ నుంచి సత్వరమే బయటపడేసే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
1. కొబ్బరి నీళ్లు
- డెంగ్యూ బారిన పడితే శరీరం బాగా డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి కొబ్బరి నీళ్లు బాగా తోడ్పడుతాయి. కాబట్టి డెంగ్యూ రోగులకు వైద్యులు కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తుంటారు.

2. పొప్పడి ఆకుల రసం
- పొప్పడి ఆకుల రసం కూడా డెంగ్యూ చికిత్సలో బాగా పనిచేస్తుంది. డెంగ్యూ రోగి పొప్పడి ఆకుల రసం తీసుకోవడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ మెరుగుపడుతుంది. అదేవిధంగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మంచి ఫలితం రావాలంటే డెంగ్యూ పేషెంట్ పొప్పడి ఆకుల రసాన్ని నీటితో కలిపి రోజుకు రెండుమూడు సార్లు తీసుకోవాలి.

3. మేక పాలు
- మేక పాలలో సెలెనియం పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో సెలెనియం కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో వైరస్లు వృద్ధి చెందకుండా కూడా సెలెనియం తోడ్పడుతుంది. కాబట్టి డెంగ్యూ పేషెంట్లు త్వరగా కోలుకోవడానికి మేక పాలు తీసుకోవడం చాలా ముఖ్యం.

4. కివీ ఫ్రూట్
- డెంగ్యూ పేషెంట్ కివీ పండును ఆహారంలో తీసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేగాక ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.

5. వేప ఆకులు
-
- వేప ఆకులలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇవి వైరస్ల వృద్ధిని, వ్యాప్తిని అరికట్టడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. డెంగ్యూ చికిత్సలో ప్రకృతి సిద్ధమైన ఔషధంగా వేప ఆకులు పనిచేస్తాయి.

Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

