Postpartum Depression | తండ్రులకూ ప్రసూతి వైరాగ్యం.. నాన్నగా ప్రమోషన్ పొందిన వ్యక్తి కుంగుబాటుకు గురవ్వడం ఏమిటి?
మాతృత్వం పొందిన మధుర క్షణం అమ్మకు అపురూపం. పురిటి నొప్పులు ఆమెకు ప్రసూతి వైరాగ్యం (పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ - పీపీడీ ) కలిగిస్తాయి. ప్రతీ ఐదుగురు తల్లుల్లో ఒకరిని ఈ డిప్రెషన్ కొన్నాళ్లు వెంటాడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఏడాదిపాటు కుంగుబాటు, ఆందోళనతో అమ్మ సతమతమవుతుంటుంది.
Postpartum Depression | మాతృత్వం పొందిన మధుర క్షణం అమ్మకు అపురూపం. పురిటి నొప్పులు ఆమెకు ప్రసూతి వైరాగ్యం (పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ – పీపీడీ ) కలిగిస్తాయి. ప్రతీ ఐదుగురు తల్లుల్లో ఒకరిని ఈ డిప్రెషన్ కొన్నాళ్లు వెంటాడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఏడాదిపాటు కుంగుబాటు, ఆందోళనతో అమ్మ సతమతమవుతుంటుంది. అయితే, శిశు జననం తర్వాత తండ్రులూ పీపీడీ బారినపడతారని కొన్ని అధ్యయనాలు గుర్తించాయి. నాన్నగా ప్రమోషన్ పొందిన వ్యక్తి కుంగుబాటుకు గురవ్వడం ఏమిటి?
కారణాలు
శిశువు జన్మించిన తర్వాత తండ్రుల్లో కుంగుబాటు సమస్యకు కారణాలేంటనే దానికి సరైన సమాధానాలు లేవు. సాధారణంగా భావోద్వేగాలు, ఒత్తిడి, అప్పటివరకు కొత్తప్రాణికి ఊపిరినివ్వడం గురించి అనుభూతి చెందకపోవడం లాంటివి ఈ పరిస్థితికి కారణాలుగా అంచనా వేస్తున్నారు. వీటికి అదనంగా ఆర్థిక బాధ్యతలు, జీవనశైలి మార్పులు, నిద్ర లేమి, ఇంట్లో పని ఒత్తిడి లాంటివి కూడా తండ్రుల మీద ప్రభావం చూపుతాయి అంటున్నారుపరిశోధకులు.
ఇప్పుడు ప్రసవం అనంతర భద్రత (పోస్ట్ నేటల్ కేర్) అంటే… అంతా బాలింత కేంద్రంగా ఉంటుంది. కానీ, తండ్రుల మానసిక స్థితి ఏంటనే విషయాన్ని ఎవరూ అంతగా పట్టించుకోరు. కానీ, బిడ్డ పుట్టగానే తల్లి, తండ్రి ఇద్దరి మానసిక ఆరోగ్యాన్ని బేరీజువేయాలి. పీపీడీగా గుర్తిస్తే తొలినాళ్లలోనే తగిన చికిత్స అందించి ఆరోగ్యకరమైన కుటుంబ జీవితం సాగించడానికి తగిన సాయం అందించాలి.
లక్షణాలు
- జీవితంపై నిరాశ.
- శిశువుకు తగినంత ప్రేమను పంచలేమేమో అన్నఅపరాధ భావన.
- బిడ్డకు తగిన సమయం కేటాయించడం లేదని బాధపడటం.
- అలసటగా, కొన్నిసార్లు మొద్దుబారినట్టుగా అనిపించడం.
- వేళకు సరైన నిద్ర లేకపోవడం.
- అసంబద్ధమైన, భయం కలిగించేఆలోచనలు రావడం.
- ఆకలి తగ్గడం, లేదంటే అతిగా ఆకలి వేయడం. కానీ, తినాలని లేకపోవడం.
- అసహనంగా ఉండటం.
- భార్యతో, బిడ్డతో విముఖంగా ఉండటం.
- అనవసరమైన విషయాల పట్ల ఆందోళన.
- తలనొప్పి లాంటి ఆరోగ్య సమస్యలుతలెత్తడం.
ఇలా పోరాడాలి..
మంచి తండ్రిగా నిలిచిపోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఇవి…టాక్ థెరపీపీపీడీతో బాధపడుతున్న వాళ్లకు టాక్ థెరపీ మంచి మందు. శిశువు జన్మించిన తర్వాత ఎప్పుడైనా ఆందోళనగా అనిపిస్తే, ఏకాంతంగా మీకు మీరు మాటలతో ధైర్యం చెప్పుకోవాలి. మీ జీవితానికి కొత్త దృక్కోణం అలవర్చుకోవడం ఇక్కడ ముఖ్యమైన అంశం.
మెడికేషన్
పీపీడీ ఉన్నవాళ్లు వైద్యుణ్ని సంప్రదించాలి. మీ సమస్య అతనికి వివరించాలి. తగిన చికిత్స తీసుకోవాలి. అంతేతప్ప బాధపోవడానికి మద్యానికి, మత్తుకు బానిసలు కాకూడదు.
సంకల్పబలం
కొత్త ఏడాది తీర్మానాలు, సంకల్పాల్లాగే పితృత్వాన్నీ చూడాలి. పుట్టబోయే బిడ్డను మీ జీవితానికి మరో కొనసాగింపుగా ఆస్వాదించాలి. బాగా తినాలి. వ్యాయామం – యోగా చేయాలి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు ప్రేమించాలి.
గోడలు బద్దలు కొట్టాలి
ప్రసూతి బాధ స్త్రీలకు మాత్రమే కాదు… బిడ్డ పుట్టడంతో తండ్రులకూ భావోద్వేగ సమస్యలు వస్తాయని గుర్తించాలి. తప్పుగా భావించకుండా వీటి గురించి చర్చించాలి. నిపుణులను కలిసి పితృత్వ బాధల్లో అపోహలను తొలగించుకోవాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

