Kriti Sanon | అలలు లేని సంద్రం, మొయిలు లేని అంబరం ముచ్చటైన నీలి వర్ణంలో మనసును తేలిపోయేలా చేస్తాయి. ఇంద్రధనుస్సు రంగుల్లో తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న నీలం అంటే ఫ్యాషన్ ప్రియులకు మక్కువ ఎక్కువే! ఊదా రంగుకు చిక్కదనం హంగు తోడైతే నీలం మరింత వాటంగా మెరిసిపోతుంది.
నిశిరాతిరి నీలాన్నంతా అరువు తెచ్చి నేసిన నెట్టెడ్ శారీని చుట్టుకొని కృతి సనన్ సరికొత్త లుక్లో ఇలా దర్శనమిచ్చింది. మతులు చెదరగొట్టే ఈ చిత్తరువు చూస్తుంటే ఈ ముదిత నీలాకాశాన్ని తన కౌగిట బంధించినట్టు లేదూ!