చుక్కలా ఉంది అన్న మాట అందగత్తెలందరికీ వర్తిస్తుంది. కానీ ఈ డ్రెస్‌లో నటి కృతి సనన్ని చూసి పాలపుంతలా ఉంది అనాలేమో! నక్షత్రాలన్నీ గుంపుగా కూడినట్టు వెండిరంగు కాంతుల్లో మెరిసిపోతున్నది ఈ తార. సిల్వర్ కలర్ చతురస్రాకార క్రిస్టళ్లు పొదిగిన ప్యాంటు, జాకెట్ విభిన్న లుక్ తీసుకువచ్చాయి.
వాటికి జతగా చేరిన కడా, బ్రేస్లెట్లు ఆమెను ైస్టెల్ ఐకాన్‌లా చూపుతున్నాయి. నటనలోనే కాదు, ఫ్యాషన్‌లోనూ తాను ప్రత్యేకమే అని ఎప్పటికప్పుడు కృతి ఇలాగే నిరూపిస్తూ ఉంటుంది!