తక్కువలోనే ఎక్కువ క్లీనింగ్
మేకప్ బ్రష్లు శుభ్రంగా ఉండాలంటే.. రెగ్యులర్గా వాష్ చేస్తూ ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకమైన బ్రష్ క్లెన్సర్లు ఉపయోగించాలి. అయితే, అవి ఖరీదైనవి. త్వరగా ఖాళీ అయిపోతాయి. దానికి ప్రత్యమ్నాయంగా సాధారణ బేబీ షాంపూను వాడుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
మేకప్ బ్రష్లు శుభ్రంగా ఉండాలంటే.. రెగ్యులర్గా వాష్ చేస్తూ ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకమైన బ్రష్ క్లెన్సర్లు ఉపయోగించాలి. అయితే, అవి ఖరీదైనవి. త్వరగా ఖాళీ అయిపోతాయి. దానికి ప్రత్యమ్నాయంగా సాధారణ బేబీ షాంపూను వాడుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. తటస్థ పీహెచ్ని కలిగి ఉండే ఈ బేబీ షాంపూలు.. మేకప్ బ్రష్లను సమర్థంగా శుభ్రం చేస్తాయి. బ్రష్ బ్యారెల్ లోపల మొండిగా ఉండే లిక్విడ్ ఫౌండేషన్, సెట్టింగ్ పౌడర్లను సులభంగా తొలగించేస్తాయి.
బ్రిసిల్స్ను కూడా చాలా మృదువుగా మార్చేస్తాయి. ఇక సున్నితంగా ఉండే బేబీ షాంపూలు.. బ్రష్లోని వెంట్రుకలు మొరటుగా మారకుండా, ఊడిపోకుండా కాపాడతాయి కూడా. అంతేకాకుండా, గాఢమైన రసాయనాలు ఉండే క్లెన్సర్లతో బ్రష్లను శుభ్రం చేస్తే.. ఆ రసాయనాలు బ్రష్పైనే ఉండిపోతాయి. మళ్లీ వాటిని వాడినప్పుడు చర్మంపై దద్దుర్లు, అలర్జీలను కలిగిస్తాయి.
బేబీ షాంపూతో అలాంటి భయం ఉండదు. ప్రొఫెషనల్ క్లెన్సర్లతో పోలిస్తే.. ఇవి చాలా చౌకగా, సులభంగా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మేకప్ ఎక్కువగా, వాటర్ ప్రూఫ్ ఫౌండేషన్ లాంటి స్ట్రాంగ్ మేకప్ వేసుకునేవాళ్లయితే.. బేబీ షాంపూలో ఒక చుక్క కొబ్బరి నూనె వేసి, కలిపి క్లీన్ చేస్తే సరి. అది మేకప్ను చాలా సులభంగా కరిగించేస్తుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

