సీటు అనగానే.. ఎన్నికల సీజన్ మొదలైపోయింది కాబట్టి, అసెంబ్లీ సీటు గుర్తుకొస్తుంది. స్కూల్ అడ్మిషన్ల సీజన్ కూడా ఆరంభమైంది కాబట్టి, స్కూలు సీటు కావచ్చని భ్రమపడతాం. ఇంజినీరింగ్, ఐఐటీల హడావుడి అంతాయింతా కాదు కాబట్టి, సీటు గ్యారెంటీ స్కీమేమో అనుకుంటాం. అన్‌స్టాపబుల్ నుంచి కౌన్ బనేగా వరకూ రకరకాల గేమ్‌షోలు ఏలేస్తున్నాయి కాబట్టి.. హాట్ సీట్ తళుక్కున మెరుస్తుంది. ఇంటీరియర్స్ విషయంలో ఏ మాత్రం రాజీపడని గృహిణులకు మాత్రం సీటు అంటే.. డ్రాయింగ్ రూమ్‌లోని ఫర్నిచరే! కాబట్టే, తయారీ దారులు అందమైన, వినూత్నమైన ఫర్నిచర్ డిజైనింగ్‌లో పోటీ పడుతున్నారు. ఫొటోలలోని ఫర్ని చర్ను చూడండి.. పాలిస్టర్, పాలీయురథేన్ తదితర మెటీరియల్‌తో వీటిని రూపొందించారు. ఏ రంగు గోడల మధ్య అయినా.. బంగారంలా మెరిసిపోతాయి. ధరలు లక్ష నుంచి మొదలవుతాయి. బ్రాండ్‌ను బట్టి మారిపోతాయి.