Iluminated Mandir | టెక్నాలజీతో వెలిగిపోతున్న మందిరాలు.. ఇప్పుడివే ట్రెండ్!
ఇల్లు చిన్నదైనా పెద్దదైనా, అద్దె ఇల్లయినా, సొంత ఇల్లయినా... ఉన్నంతలో మనతో పాటు భగవంతుడికి కూడా ఓ చోటు ఏర్పాటు చేసుకుంటాం. నచ్చిన దేవుణ్ని నిలుపుకొని రోజూ నమస్కారం చేసుకుంటాం. అందుకోసం ఇప్పుడు వస్తున్న మందిరాలువెలుగు పూలు పూస్తున్నాయి. దేవుణ్ని పెట్టుకునే చోట భగవంతుడి రూపాలు లైట్ల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. ఇల్యుమినేటెడ్ మందిరాలు ఇంటి అలంకరణలోనూ భాగమవుతున్నాయి.
Iluminated Mandir | ఇల్లు చిన్నదైనా పెద్దదైనా, అద్దె ఇల్లయినా, సొంత ఇల్లయినా… ఉన్నంతలో మనతో పాటు భగవంతుడికి కూడా ఓ చోటు ఏర్పాటు చేసుకుంటాం. నచ్చిన దేవుణ్ని నిలుపుకొని రోజూ నమస్కారం చేసుకుంటాం. అందుకోసం ఇప్పుడు వస్తున్న మందిరాలువెలుగు పూలు పూస్తున్నాయి. దేవుణ్ని పెట్టుకునే చోట భగవంతుడి రూపాలు లైట్ల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. ఇల్యుమినేటెడ్ మందిరాలు ఇంటి అలంకరణలోనూ భాగమవుతున్నాయి.
ఇప్పుడంతా హంగులదే హవా. ఒంటి సోకు ఉంటే చాలదు, ఇంటి సోకూ ఉండాలని పెద్దలు చెప్పినట్టు.. మనమెంత బాగా ముస్తాబవుతామో ఇంటినీ అంతే అందంగా అలంకరించుకోవాలన్న పోకడ అధికం అవుతున్నది. అందులోనూ ఏ ఇంట్లో అయినా దేవుడి మందిరాన్ని ప్రత్యేకంగా నిర్మించుకుంటారు. లేదా తెచ్చి పెట్టుకుంటారు. ఎవరెవరి అభిరుచులకు తగ్గట్లు వాళ్లు దాన్ని తీర్చి దిద్దుకుంటారు. ఈ ప్రాధాన్యాన్ని గమనించే ‘కోరియన్ త్రీడీ ఇల్యుమినేటెడ్ మందిరాల’ను తయారు చేస్తున్నారు ఇంటీరియర్ డిజైర్లు. గృహాలంకరణకు వన్నె తెచ్చేలా రూపొందుతున్నాయివి.

విభిన్న రకాలు..
కోరియన్ అనే ఒక ప్రత్యేకమైన మెటీరియల్‌తో ఈ వెలిగే కోవెలలను తయారు చేస్తున్నారు. మనం కబోర్డులకు చేయించుకునే షీట్ల తరహాలో మరింత గట్టిగా మన్నికగా ఉంటాయివి. ఇందులో రాముడు, గణపతి, వేంకటేశ్వరుడు, లక్ష్మి, శివపార్వతులు.. ఇలా రకరకాల దేవతా రూపాలను త్రీడీ ఆకృతిలో మలిచి వెనకవైపు లైట్లు బిగిస్తారు. ఇందులో కేవలం బంగారు రంగు వెలుగుల్లో కనిపించేవి ఒక తరహావి. మరో రకంలో.. రంగురంగుల్లో ఉండే దేవుళ్ల ఫొటోలను మందిరం లోపలి గోడమీద ముద్రిస్తారు. కాంతిని బాగా ప్రసరింపజేసే అలబాస్టర్ అనే మరో ప్రత్యేకమైన షీట్‌ను దీని వెనుక భాగంలో అమరుస్తారు. అక్కడా లైట్లు ఉంచడం వల్ల దేవతా రూపాలు వెలుగుతూ త్రీడీ తరహాలో కనిపిస్తాయి. మందిరం చుట్టూ ఉండే స్తంభాల్లాంటి నిర్మాణాల్లోనూ బల్బులు ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని వేసి, తీయొచ్చు. హరే రామ, జై శ్రీరామ్, రాధేశ్యామ్, ఓం నమఃశివాయ, శ్రీమాత్రేనమః.. లాంటి మంత్రాలూ కాంతిమంతంగా కనిపిస్తున్నాయి. ట్రెడిషనల్, మోడ్రన్ డిజైన్ల మేలు కలయికగా ఈ చిట్టి గుళ్లు ఇంట్లో కొలువుదీరుతున్నాయి. పూజ గదికి దీపకాంతికి తోడు విద్యుల్లతల కాంతులనూ తెచ్చిపెడుతున్నాయి. ఈ పండుగ సీజన్లో మీ ఇంటి కోవెలనూ అందంగా ముస్తాబు చేసుకోండి.

Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- iluminated mandir
- Temple
- trend
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

