Priyanka | బటర్ ఫ్లై మమ్మీ.. సీతాకోక చిలుకల కోసం ఇంటి బాల్కనీకి పచ్చకోక తొడిగిన ప్రియాంక
ముంబయిలోని ఒక అపార్ట్మెంట్లోని 13వ అంతస్తులో ఉంటుంది ప్రియాంక. అందమైన ఫ్లాట్.. అంతకన్నా అందమైన బాల్కనీ. అందులోకి అడుగుపెడితే ముచ్చటైన పూలతోటలోకి ప్రవేశించినట్టు ఉంటుంది. దీన్ని పూలతోట కాదు.. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనాలేమో! ఈ బటర్ ఫ్లై బాల్కనీలో ఐదువేల సీతాకోక చిలుకలు ఉన్నాయి.
Priyanka | ముంబయిలోని ఒక అపార్ట్మెంట్లోని 13వ అంతస్తులో ఉంటుంది ప్రియాంక. అందమైన ఫ్లాట్.. అంతకన్నా అందమైన బాల్కనీ. అందులోకి అడుగుపెడితే ముచ్చటైన పూలతోటలోకి ప్రవేశించినట్టు ఉంటుంది. దీన్ని పూలతోట కాదు.. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనాలేమో! ఈ బటర్ ఫ్లై బాల్కనీలో ఐదువేల సీతాకోక చిలుకలు ఉన్నాయి. వీటిలో ఏకంగా 15 జాతులు కనువిందు చేస్తుంటాయి. ఒకప్పుడు పెరట్లో సీతాకోక చిలుకలు విహరిస్తూ కనువిందు చేసేవి. ఇప్పుడు వాటికి ఆవాసాలు లేవు. పురుగు మందుల వాడకం, వాతావరణ మార్పులతో సీతాకోక చిలుకలు కనుమరుగవుతున్నాయి.
ఇలాంటి సందర్భంలో.. అందునా ముంబయి లాంటి కాలుష్య పూరితమైన మహానగరంలో ఓ ఇంటి బాల్కనీ చూరుపై ఐదువేల సీతాకోక చిలుకలు వాలుతున్నాయంటే గొప్ప విషయమే. ఈ బటర్ ఫ్లైల ఆహారం కోసం ప్రియాంక తన బాల్కనీలో నిమ్మగడ్డి, ఆకుకూరలు పెంచుతున్నది. కనువిందు చేసే సీతాకోక చిలుకల కోసం ఇంటి బాల్కనీకి పచ్చకోక తొడిగిన ప్రియాంకను అందరూ ‘బటర్ ఫ్లై మమ్మీ’ అని పిలుస్తుంటారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

