వేలి ముద్ర పడితేనే..
స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తున్న గూగుల్ మరో కొత్త ఆప్షన్‌ను తీసుకొస్తున్నది. ‘ఫైండ్ మై డివైజ్' వెర్షన్‌ను త్వరలోనే అప్డేట్ చేయనుంది.
స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తున్న గూగుల్ మరో కొత్త ఆప్షన్‌ను తీసుకొస్తున్నది. ‘ఫైండ్ మై డివైజ్’ వెర్షన్‌ను త్వరలోనే అప్డేట్ చేయనుంది. ఇప్పటి వరకు ఇది ‘బయోమెట్రిక్ అన్‌లాక్’ ఫంక్షనింగ్ దశలో ఉన్నది. అంటే గూగుల్ పాస్‌వర్డ్‌తో దీన్ని ఓపెన్ చేయొచ్చు. ఈ పాస్వర్డ్ కాస్తా ఫ్రాడ్‌స్టర్ల చేతికి చిక్కితే.. మీ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టి మరీ తస్కరించే ప్రమాదమూ లేకపోలేదు.
దీనికి రిమోట్ లాక్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఫింగర్ ప్రింట్, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా మాత్రమే దీనిని ఓపెన్ చేయగలం. గూగుల్ పాస్వర్డ్ చేజిక్కించుకొని ఇతరులు ఎవరూ మన ఫోన్ ఎక్కడుందో కనిపెట్టలేరన్నమాట! దీంతో డివైజ్ సహా అందులోని డాటా కూడా సేఫ్‌గానే ఉంటుంది. ఆండ్రాయిడ్ 10, అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నడుస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు. అయితే ఈ సరికొత్త ఫీచర్‌ను పొందాలంటే మాత్రం ఈ ఏడాది చివరిదాకా ఆగాల్సిందేనట.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

