Tattoos | టాటూలు వేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. తమకు ఇష్టమైన వారిపై ఉన్న ప్రేమకు గుర్తుగా కొందరు టాటూ వేయించుకుంటే, ఫ్యాషన్ కోసం ఇంకొందరు వేయించుకుంటారు. రకరకాల గుర్తులు, దేవుళ్ల బొమ్మలు, పదాలు.. ఇలా తమకు నచ్చిన వాటిని పచ్చబొట్టుగా వేయించుకుంటారు. టాటూ వేయించుకున్నప్పుడు చర్మ సంరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేకపోతే అలర్జీలు, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. టాటూ వేయించుకున్న ప్రాంతంలో కణాలు దెబ్బతినడంతో చర్మం తేమను కోల్పోయి నిర్జీవంగా మారుతుంది.
అక్కడ కొత్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించడానికి మాయిశ్చరైజర్ అప్లయ్ చేయడం మంచిది. ఆ ప్రాంతంలో కొత్త కణాలు పుట్టుకొచ్చేదాకా.. అంటే రెండు మూడు వారాలపాటు బ్యూటీ మాస్క్‌లు, స్క్రబ్‌లు, వ్యాక్స్‌లు వాడొద్దు. వీటివల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. టాటూ వేయించుకున్న తర్వాత రెండు మూడు వారాల దాకా స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టొద్దు. అలా చేస్తే టాటూ వెలిసిపోతుంది. పూల్ నీటిలో క్లోరిన్, ఉప్పు ఉంటుంది కాబట్టి అవి టాటూ వేయించుకున్న చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి.