Fashion | ఎండవేళ నిమ్మ మాటే చల్లటి నీటి ఊటలా ఉంటుంది. నిమ్మపండు వన్నె కళ్లకూ, మనసుకూ హాయిగొలుపుతుంది. లేత రంగుల్లోనూ మెరిసిపోవాలంటే ఈ పసిమి వర్ణాన్నే ఎంచుకోవాలి. లెమన్ ఎల్లో కలర్ ఆర్గంజా లెహెంగాకు తెలుపు రంగు క్రాప్టాప్ను జత చేశారు డిజైనర్లు. ప్రకృతి అందాలను ఆవిష్కరించేలా టాప్ మీద ఆకులూ, తీగలూ, పక్షుల బొమ్మలను త్రీడీ తరహా లుక్తో సునిశితంగా కుట్టారు. లెహెంగా పట్టీని కూడా జర్దోసీ, త్రెడ్వర్క్తో అలంకరించారు. వేస్తే అందంగానే కాదు, చూస్తే హాయిగానూ ఉంది కదూ ఈ జత!
సమతా చౌదరి, డిజైనర్
Samatha Chowdary@wowostudios