ష్.. పరమ రహస్యం. ఎవరికీ చెప్పొద్దు. ఓ బంగారు. బొమ్మ వెండితెరను ఏలేయాలనే లక్ష్యంతో తమిళనాడు నుంచి హైదరాబాద్ వచ్చింది. పెద్దపెద్ద కళ్లు డైలాగులు చెప్పేయగలవు. ఆ చిరునవ్వుకు ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు తెలుసు. ఆమె వయ్యారంగా తలూపి నప్పుడల్లా ఆ వెండి లోలకులు ‘జీ హుజూర్ జహాపనా..’ అంటూ ఊగిపోతాయి. ఆ వెండి హ్యాండ్ వర్క్ వెయిస్ట్ బెల్ట్ పిడికెడు నడుమును పట్టి ఉంచేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నది. వంకాయ రంగు శాటిన్.. వన్ షోల్డర్ డ్రేప్డ్ పార్టీ డ్రెస్ పిల్లకాయల గుండెల్లో బుగులు పుట్టించడం ఖాయం. స్పై కథానాయిక ఐశ్వర్య మీనన్.. కండ్లయితే అచ్చంగా మీనాలే!