కొన్ని పాటలు, కొన్ని డైలాగులు, కొన్ని జ్ఞాపకాలలాగే… ప్రింట్లలో ఎప్పటికీ పాతబడనివి లెహరియానే. ఆ డిజైన్‌కు బోర్‌కొట్టని జోర్దార్ కాంబినేషన్ ముదురు పచ్చ, ఎరుపు రంగులు తోడైతే ఫ్యాషన్ పరేషాన్ కావల్సిందే. ఇక్కడ కనిపిస్తున్న లెహరియా చీర టై అండ్ డై అద్దకంలో క్రేప్ వస్త్రంతో రూపొందించింది. దానికి సిల్వర్ రంగు గోటా వర్క్‌తో డిజైనర్ లుక్‌ని తీసుకువచ్చారు. ఇక, ప్యాచ్‌వర్క్ చేసిన బాటిల్ గ్రీన్ అంచు రంగులోనే రవిక మ్యాచ్ చేసి లెహెరియా అంటేనే లెహరాయీ అనిపించారు.
సమతా చౌదరి, డిజైనర్
wowobySamathachowdari