Depression | ఏకాగ్రతను చిత్తుచేసే ఒత్తిడి.. బయట పడండిలా..
ఇంటిపనులు, ఆఫీసు బాధ్యతలతో ఉద్యోగినులు సతమతమవుతుంటారు. ఈ రెండిటినీ సమన్వయం చేసుకునే క్రమంలో వారిలో అసహనం పెరిగి.. ఏకాగ్రత తగ్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగం చేస్తున్న మహిళల్లో శారీరక, మానసిక ఆరోగ్యం నానాటికీ కుంటుపడుతున్నదని పరిశోధన సారాంశం.
Depression | ఇంటిపనులు, ఆఫీసు బాధ్యతలతో ఉద్యోగినులు సతమతమవుతుంటారు. ఈ రెండిటినీ సమన్వయం చేసుకునే క్రమంలో వారిలో అసహనం పెరిగి.. ఏకాగ్రత తగ్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగం చేస్తున్న మహిళల్లో శారీరక, మానసిక ఆరోగ్యం నానాటికీ కుంటుపడుతున్నదని పరిశోధన సారాంశం.
చేస్తున్న పనిపై దృష్టిసారించకపోవడం, ఇంట్లో పిల్లలపై తరచూ కసురుకోవడం, అకస్మాత్తుగా డీలా పడిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తే.. ఒత్తిడికి తలొగ్గారని నిర్ణయానికి రావొచ్చు. ఇంటి బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. ఉద్యోగమూ మానేయలేరు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలి. ఎంత కష్టమైనా సమయపాలన చాలా అవసరం. అలాగే డైట్చార్ట్లో పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
అంతేకాదు, కనీసం 7 గంటలపాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ప్రతి ఉదయం తేలికపాటి వర్కవుట్లు, యోగా చేయాలి. లేదంటే రోజురోజుకూ పెరిగే ఒత్తిడి మిమ్మల్ని మరింత చిత్తు చేస్తుంది. దాంపత్య జీవితంపై విసుగు పుట్టే ప్రమాదమూ ఉంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యను మీ జీవిత భాగస్వామికి అర్థమయ్యేలా వివరించండి.
ఇంటిపనుల్లో వారి సహకారం అవసరమని చెప్పండి. పిల్లలు కాస్త పెద్దవాళ్లయితే వారి పనులు వాళ్లే చేసుకునేలా చూసుకోండి. దైనందిన జీవితంలో ఆరోగ్యకరమైన మార్పులకు శ్రీకారం చుట్టండి. చక్కటి సంగీతం వినండి. తరచూ స్నేహితులు, బంధువులను కలుస్తూ ఉండండి. ఈ పరిష్కార మార్గాలు మీ ఒత్తిడిని కొంతవరకైనా తప్పించగలవు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

