Fashion | వెచ్చటి కౌగిళ్లు ప్రియమైన వారికే కాదు, అమితంగా ప్రేమించే పెంపుడు కూనలకూ ప్రత్యేకమే. అసలు వెచ్చని కౌగిలి అంటే వాటిదే అని వాదించేవారూ ఉన్నారు. బొచ్చు ప్రాణులు నిజంగానే వెచ్చగా ఉంటాయి. ఆ అనుభూతిని మరింత ఎక్కువ చేసేలా… చలికాలపు దుస్తుల్ని తయారు చేస్తున్నారు డిజైనర్లు.
స్వెటర్లు, స్వెట్షర్ట్లు, హుడీల మీద బొచ్చు కుక్కలు, పిల్లులు, కుందేళ్ల బొమ్మలను త్రీడీ ప్రింట్స్ రూపంలో ముద్రిస్తున్నారు. నిజంగానే అక్కడ ఉన్నాయేమో అన్నంత సహజంగా రూపొందిస్తున్నారు. చూస్తేనే వెచ్చదనపు అనుభూతి కలుగుతుంది!