చంద్రకాంతుల పోగువేసి, బంగారపు తీగల జరీ చేసి నేశారా అనిపిస్తుంది తెలుపు రంగు చీరను చూస్తే. ఇక అందులోనూ వెన్నెల వన్నెలన్నీ పోగేసినట్టు కనిపించే ఆడపిల్లకు అది అలంకారమైతే అందమే అచ్చెరువొందడం ఖాయం. శరీరానికి హాయిగా ఉండే లినెన్ వస్ర్తానికి బంగారు రంగు టిష్యూ అంచు వచ్చేలా రూపొందించారీ చీరను. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు కిందివైపు పెద్ద అంచు, పై వైపు చిన్న అంచు వచ్చేలా నేసిన ఈ చీరకు ఫ్యాషనబుల్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ జతచేశారు. సంప్రదాయానికి ఫ్యాషన్ సొబగులు అద్దడమంటే ఇదే అన్నంత ముచ్చటగా కుదిరిందీ జోడీ.
సమతా చౌదరి, డిజైనర్
wowobySamathachowdari