కోరి వచ్చి ఒడిలో వాలితే ముద్దులిచ్చి మురిసిపోయేది మీరేనా? మాకు మాత్రం ఆ ముచ్చట ఉండదా… అంటూ వీపు మీద ముద్దు ముద్దరేస్తుంది ఈ కుర్చీ! కిస్ యూ… అన్నట్టుగా ముద్దుగా మూతి చాచిన ఈ మెత్తటి కుర్చీ పేరు ఖోలే చెయిర్. హాలీవుడ్ ఫర్నిచర్ కంపెనీ హాటేసాస్ డిజైన్ చేసింది. ఇత్తడి ఫ్రేమ్, చెక్కతో రూపొందించారు. మెత్తటి కుషనింగ్, గులాబీ రంగు వెల్వెట్ వస్త్రంతో ఫినిషింగ్ చేశారు.
దీనివల్ల కూర్చునే చోటే కాదు, వీపు ఆనించే భాగమూ సౌకర్యవంతంగా ఉంటుంది. తమ ఇంట్లోని ఫర్నిచర్ ప్రత్యేకంగా ఉండాలనుకునేవారికి ఇది తిరుగులేని ఎంపిక. దీని ఖరీదు రెండు లక్షల రూపాయల పై చిలుకు. neimanmarcus.comలో ఆర్డర్ చేయవచ్చు.