గోడ ఖాళీగా ఉందంటే చాలా మందికి మనసు ఖాళీగా ఉండదు. దానికి ఏదో ఒకటి అలంకరించేసి హమ్మయ్య అనుకుంటేగానీ కుదురుండదు. అలాంటి వాళ్లకోసమే గోడకు పెట్టే సీనరీలు, ఫొటోఫ్రేములు, వాల్ పోస్టర్లు… ఇలా ఎన్నో తయారు చేస్తుంటారు సృజనకారులు. ఇప్పుడు సరికొత్తగా మరోరకం కుడ్యాలంకరణ అందుబాటులోకి వచ్చింది.
‘సర్యులర్ వీవింగ్ కలర్ఫుల్ వాల్ డెకార్’ పేరిట వస్తున్న వీటిని రంగురంగుల ఊలుతో రూపొందిస్తున్నారు. అందమైన వర్ణాల సమ్మేళనంగా ఉండే ఇవి ఇంటికి కొత్త అందాన్ని తీసుకొస్తున్నాయి.