HomeLifestyleCoffee Removes Dead Skin Cells From Dry Skin
చక్కని అందానికి.. చిక్కటి కాఫీ
రుచితో జిహ్వను కట్టిపడేసే కాఫీ బ్యూటీప్యాక్గానూ అద్భుతాలు చేస్తుంది. కాఫీ పొడి చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది. ముఖ వర్చస్సును రెట్టింపు చేసుకోవడానికి ఈ కాఫీ ప్యాక్‌లు ప్రయత్నించండి.
రుచితో జిహ్వను కట్టిపడేసే కాఫీ బ్యూటీప్యాక్గానూ అద్భుతాలు చేస్తుంది. కాఫీ పొడి చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది. ముఖ వర్చస్సును రెట్టింపు చేసుకోవడానికి ఈ కాఫీ ప్యాక్‌లు ప్రయత్నించండి.
ఒక టీ స్పూన్ కాఫీ పొడిలో అర టీ స్పూన్ చక్కెర గానీ, ఉప్పు గానీ వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు కొద్దిగా అప్లయ్ చేసి మర్దనా చేయాలి. పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై ఉండే దుమ్ము, ధూళి, మృతకణాలు తొలగిపోయి మృదువుగా మారుతుంది.
కాఫీ పొడి, తేనె మిశ్రమం ముఖానికి అప్లయ్ చేసుకుంటే ట్యాన్ తొలగిపోతుంది. కాఫీ పొడిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కాబట్టి కాఫీ ప్యాక్‌లు ముఖంపై మొటిమలను తొలగిస్తాయి.