కార్తికం దీపాల మాసం. వెన్నెల నెల. రోజూ చూసే చంద్రుడిలో రోజూ కనిపించని అందాన్ని చూస్తాం. నిత్యం పలకరించే అమ్మాయిలోనే.. కొత్త మెరుపేదో గమనిస్తాం. అది పట్టుచీర వల్ల వచ్చిందా, లక్ష్మీ హారంతో సొంతమైందా, వన్నెల వడ్డాణంతో పోగుపడిందా అన్నది మాత్రం ఓ పట్టాన తేల్చి చెప్పలేం. అసాధ్యం కూడా.