కెమెరా యోధురాలు
ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినా నిరాశ చెందలేదు. కన్నీళ్లు దిగమింగుకుంటూ, సుడిగుండాలు దాటుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఉన్నత విద్యాభ్యాసం చేసింది. తన కాళ్లపై తాను నిలబడింది. కొడుకును చదివించుకుంటూ, తల్లిదండ్రులకూ పట్టెడన్నం పెడుతున్నది.
ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినా నిరాశ చెందలేదు. కన్నీళ్లు దిగమింగుకుంటూ, సుడిగుండాలు దాటుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఉన్నత విద్యాభ్యాసం చేసింది. తన కాళ్లపై తాను నిలబడింది. కొడుకును చదివించుకుంటూ, తల్లిదండ్రులకూ పట్టెడన్నం పెడుతున్నది. పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్ కాలనీకి చెందిన తులసి..తన జీవన పోరాటంలో కెమెరాను ఆయుధంగా మలుచుకున్నది.
జీవితం అనూహ్యం. మనం అనుకునేది ఒకటి. జరిగేది మరొకటి. తులసి జిందగీ కూడా విధి ఆడించే వింత నాటకంలో ఓ భాగమే. పెద్దపల్లి యైటింక్లయిన్ కాలనీకి చెందిన దమ్మాల వెంకటరమణ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. వెంకటరమణ సింగరేణి ఉద్యోగి. ఫొటోగ్రఫీ అతని ప్రవృత్తి. వారసత్వ ఉద్యోగాన్ని కొడుకుకు ఇచ్చినా, విరమణ తర్వాత కూడా కెమెరాను వదల్లేదు. ఆయన రెండో కూతురు తులసికి బాబు పుట్టాక భర్తతో ఇబ్బందులు తలెత్తాయి. గత ఎనిమిదేండ్లుగా పుట్టింట్లోనే ఉంటున్నది. ఉద్యోగాల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో నాన్న వృత్తినే తానూ స్వీకరించింది. ఎక్కడ ఏ ఈవెంట్ ఉన్నా.. ఠంచనుగా వాలిపోతుంది. ఫొటోలు, వీడియోల ఎడిటింగ్ కూడా తానే చేస్తుంది. ఆ పనితనం వల్లే పరిసర కాలనీల ఆర్డర్స్ అన్నీ తులసికే వస్తాయి. దీంతో పదిహేను మందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. మరోవైపు తన పన్నెండేండ్ల బాబు త్రిలోక్ను చదివించుకుంటున్నది. కన్నవారికి అండగానూ నిలుస్తున్నది. తన సృజనతో ఫొటోగ్రఫీలో అనేక అవార్డులు సొంతం చేసుకున్నది. తనిప్పుడు మహిళా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా.

Photograper
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- photographer
- photography
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

