ఎండలు మండుతున్నాయని కూలర్ కొంటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక పాటించాల్సిందే
Summer Air Cooler | ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. గతంతో పొలిస్తే ఈసారి వేడే కాదు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. దీంతో అందరూ ఏసీలు, కూలర్లు కొనేందుకు రెడీ అవుతున్నారు. అయితే కూలర్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండని చెబుతున్నారు నిపుణులు.
పర్సనల్ కూలర్స్ vs డిసర్ట్ కూలర్స్
కూలర్లలో ఈ రెండు రకాలుంటాయి. రూమ్ సైజుని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. 200-300sft లో మీరుండే గది ఉంటే పర్సనల్ కూలర్ సరిపోతుంది. అంతకుమించి రూమ్ సైజు ఉంటే కనుక డిసర్ట్ కూలర్ తీసుకోవడం మంచిది.
వాటర్ ట్యాంక్ కెపాసిటి
కూలర్ తీసుకునేముందు ఈ విషయం గురించి కూడా ఆలోచించండి. మీరుండే గది చిన్నదైతే 15-25లీటర్లు, కాస్త పెద్దదైతే 25-40లీటర్లు, ఇంకా పెద్దదైతే 40 లీటర్ల కన్నా ఎక్కువ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉన్న కూలర్ ని తీసుకోవడం ఉత్తమం.
వాతావరణం
పొడి వాతావరణంలో అయితే డిసర్ట్ కూలర్స్ బాగా పనిచేస్తాయి. అలాగే తేమ వాతావరణంలో అంటే తీర ప్రాంతాల్లో నివసించే వాళ్లు పర్సనల్, టవర్ కూలర్లు తీసుకోవడం బెటర్.
సౌండ్
కూలర్ కొనేముందు నాయిస్ లెవెల్ అంటే కూలర్ ఆన్ చేసినప్పుడు ఎంత సౌండ్ వస్తుందన్నది చెక్ చేసుకోవాలి. షోరూమ్‌లో ఓసారి డెమో చూడటం మంచిది.
ఆటో ఫిల్ ఆప్షన్
కూలర్లలో ఆటో ఫిల్ ఆప్షన్ ఉంటుంది. నీళ్లు ఖాళీ కాగానే ఆటోమెటిక్‌గా ఫిల్ అవుతుంది. ఇలాంటివి తీసుకోవడం వల్ల కూలర్ మోటార్ పాడుకాకుండా ఉంటుంది.
కూలింగ్ ప్యాడ్స్
ఎయిర్ కూలర్‌కు కూలింగ్ ప్యాడ్స్ కూడా ముఖ్యమే. వూల్ వుడ్, యాస్పెన్ ప్యాడ్స్, హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ అని వివిధ రకాలుంటాయి. హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ ఎక్కువ కూలింగ్ నిస్తుంది. మెయింటనెన్స్ కూడా తక్కువ.
ఐస్ ఛాంబర్
కొన్ని కూలర్లలో ఫాస్ట్ కూలింగ్ కోసం ఐస్ ఛాంబర్స్ ఉంటాయి. అందులో మీరు ఐస్ క్యూబ్స్ వేస్తే ట్యాంక్ త్వరగా కూల్ అవుతుంది.
పవర్ యూసేజ్
కూలర్ వేసినప్పుడు ఎన్ని పవర్ యూనిట్లు అవుతుందన్నది తెలుసుకోవడం ముఖ్యం. స్టార్ రేటింగ్స్ ని చూసి ఎంపిక చేసుకోండి. అలాగే ఈమధ్యన ఇన్వర్టర్ టెక్నాలజీతో కూలర్లు వస్తున్నాయి. వీటి వల్ల కూడా పవర్ సేవ్ అవుతుంది. కరెంట్ పోయినా కూలర్ కొద్ది సేపు పనిచేస్తుంది.
ఇతర ఫీచర్లు
టెక్నాలజీ పెరుగుతోంది కాబట్టి కూలర్లలో ఇప్పుడు చాలా ఫీచర్లు వస్తున్నాయి. రిమోట్ కంట్రోల్, యాంటీ మస్కిటో ఫిల్టర్, డస్ట్ ఫిల్టర్ లాంటి అదనపు ఫీచర్లను ఇస్తున్నారు. ఒకసారి వాటిని కూడా ఎంక్వైరీ చేసుకొని మంచి కూలర్ ని తీసుకోండి.
Read More :
“Food Storage Tips | ఎండాకాలంలో ఆహార పదార్థాలు తొందరగా పాడవ్వద్దంటే ఇలా చేయండి” “డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారా.. ఇవి తింటే చాలు!” “Diabetes : షుగర్ ఉన్నవాళ్లు ఈ సమ్మర్లో పుచ్చ కాయ తినొచ్చా?” “Summer Food | సమ్మర్లో ఈ ఫుడ్ తింటే ఏమవుతుందో తెలుసా”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Air cooler
- cooler
- Summer
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

