లోబడ్జెట్లోనే బాత్రూమ్ క్లీన్
బాత్రూమ్ను ఎంత శుభ్రం చేసినా.. మళ్లీ మొదటికే వస్తుంది. ఎన్నిరకాల క్లీనర్లు వాడినా.. రెండుమూడు రోజులకే దుర్వాసనతో నిండిపోతుంది. ఇంట్లో వారికి ఎలా ఉన్నా.. అతిథులు వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో చాలామంది ఖరీదైన రూమ్ ఫ్రెష్నర్లు ఉపయోగిస్తుంటారు.
బాత్రూమ్ను ఎంత శుభ్రం చేసినా.. మళ్లీ మొదటికే వస్తుంది. ఎన్నిరకాల క్లీనర్లు వాడినా.. రెండుమూడు రోజులకే దుర్వాసనతో నిండిపోతుంది. ఇంట్లో వారికి ఎలా ఉన్నా.. అతిథులు వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో చాలామంది ఖరీదైన రూమ్ ఫ్రెష్నర్లు ఉపయోగిస్తుంటారు. కానీ, అవి వారం కన్నా ఎక్కువ పనిచేయవు. అయితే, తక్కువ ఖర్చులోనే, ఇంట్లో ఉండే వస్తువులతో బాత్రూమ్లోని వాసనను పారదోలే మార్గాలేంటో చదివేయండి.
- రసాయన స్ప్రేలకు బదులుగా.. పుదీనా నూనె, లావెండర్ నూనె వాడితే బాత్రూమ్ చాలా ఫ్రెష్‌గా మారిపోతుంది. వాటి సువాసన చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది.
- బాత్రూమ్ కడిగే నీటిలో కొద్దిగా తెల్ల వెనిగర్ కలిపితే.. బ్యాక్టీరియాను నిర్మూలించడంతోపాటు దుర్వాసన కూడా పోతుంది.
- ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన క్లీనర్.. బేకింగ్ సోడా. బాత్రూమ్ను కడిగేటప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వేస్తే మొండి వాసనలు మాయమవుతాయి.
- నిమ్మకాయలోని యాంటి బ్యాక్టీరియల్ గుణాలు.. వాసనను దూరం చేస్తాయి. నిమ్మకాయను ముక్కలుగా కొసి.. బాత్రూమ్ మూలల్లో ఉంచినా మంచి ఫలితం కనిపిస్తుంది.
- ఒక గిన్నెలో నీటిని తీసుకొని.. అందులో కొన్ని కాఫీ గింజలు వేయాలి. ఆ గిన్నెను బాత్రూంలో ఉంచితే.. ఆ కాఫీ సువాసన గదిని ఆహ్లాదకరంగా మారుస్తుంది.
- బాత్రూమ్లో గాలి ప్రసరణ చాలాముఖ్యం. కాబట్టి, స్నానపు గదుల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి. వీటివల్ల గదుల్లో తేమ పేరుకుపోకుండా ఉంటుంది. తద్వారా బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

