ప్రేమిస్తే ఏమవుతుంది..
‘ఎంత ఘాటు ప్రేమయో... ఎంత తీవ్ర వీక్షణమో..’ తోటరాముడి కాలం నాటి ప్రేమ గీతమిది. రాకుమారి సదరు ఘాటు ప్రేమ.. తోటరాముణ్ని పోటుగాణ్ని చేసింది. నేపాల మాంత్రికుడి ఆట కట్టించింది.
‘ఎంత ఘాటు ప్రేమయో… ఎంత తీవ్ర వీక్షణమో..’ తోటరాముడి కాలం నాటి ప్రేమ గీతమిది. రాకుమారి సదరు ఘాటు ప్రేమ.. తోటరాముణ్ని పోటుగాణ్ని చేసింది. నేపాల మాంత్రికుడి ఆట కట్టించింది. ఆ మాంత్రికుడి గడ్డంలో లేని మంత్రసిద్ధులు ప్రేమలో ఉన్నాయి మరి! నిజమైన ప్రేమలో ఉన్నవారికి నైరాశ్యం రాదని తాజా పరిశోధన ఒకటి తేటతెల్లం చేసింది. ప్రముఖ మనస్తత్వ నిపుణులు గుర్లిన్ బారువా ప్రేమికుల పతారా ఏంతో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆయన చేపట్టిన పరిశోధనలో ప్రేమాస్త్రం బ్రహ్మాస్త్రం కన్నా పవర్ఫుల్ అని తేలింది. అంతేకాదు ప్రేమిస్తే ఏమవుతుందో.. స్పష్టం చేసింది.
ప్రేమించే వ్యక్తి హృదయ స్పందనలు లయబద్ధంగా సాగుతాయని బారువా తెలియజేశారు. మనిషి మెదడు పనితీరుపై ప్రేమ అనుకూల ప్రభావం చూపుతుందట. అంతేకాదు, సదరు ప్రేమికుల శ్వాసక్రియలోనూ విస్పష్టమైన మార్పులను ఆయన గమనించారట. ప్రేమించే వ్యక్తుల మెదడులో ఎండార్ఫిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి ఫీల్‌గుడ్ హార్మోన్లు ఫ్రీగా విడుదల అవుతాయి.
ఇవి సంతోషం, ఉల్లాసం వంటి భావనలు కలిగించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాదు, ప్రేమించే వ్యక్తుల ఆలింగనాలు, అధర చుంబనాలకు కూడా మెదడులో విడుదలయ్యే ఆక్సిటోసిన్ కారణమట. సరస సల్లాపాలను ప్రేరేపిస్తుంది కాబట్టే.. ఆక్సిటోసిన్‌కు లవ్ హార్మోన్ అనే పేరుంది. డోపమైన్ హార్మోన్‌ను ఫీల్‌గుడ్ హార్మోన్‌గా చెబుతారు. ప్రేమలో ఉన్నవారికి ఈ హార్మోన్ ఆత్మవిశ్వాసం, మానసిక ఉల్లాసం తదితర పాజిటివ్ దృక్పథాలను కలిగిస్తుంది.
అంతేకాదు, ప్రేమలో ఉన్న వ్యక్తుల్లో సెరెటోనిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది ఆనందం, సంతృప్తి లాంటి భావాలను కలిగించి ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. బారువా జరిపిన అధ్యయనం ప్రకారం ప్రేమలో పడే ప్రక్రియ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. నిజమైన ప్రేమికుల్లో జీవితంపై ఆశావాహ దృక్పథం పెరుగుతుందనీ, తద్వారా వారి ఆరోగ్యం మెరుగవుతుందనీ గుర్లిన్ బారువా పరిశోధన సారాంశం.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

