రోజూ గుడ్డు తింటే మధుమేహులకు ప్రమాదమా.. పరిశోధకులు ఏం చెబుతున్నారు..?
Health tips | కోడి గుడ్డు అనేది ప్రపంచమంతా ఇష్టంగా తినే ఆహార పదార్థం. ఆరోగ్య నిపుణులు కూడా రోజుకు ఒకటి నుంచి రెండు గుడ్లు తినడం
హైదరాబాద్: కోడి గుడ్డు అనేది ప్రపంచమంతా ఇష్టంగా తినే ఆహార పదార్థం. ఆరోగ్య నిపుణులు కూడా రోజుకు ఒకటి నుంచి రెండు గుడ్లు తినడం మంచిదని చెబుతుంటారు. కానీ, ఒక పరిశోధనలో మాత్రం గుడ్లు ఎక్కువగా తింటే మధుమేహం బారినపడే ప్రమాదం ఉందని తేలింది. ఎవరైతే రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తింటారో వారిలో మధుమేహం రిస్క్ 60 శాతం పెరుగుతుందని పరిశోధకులు తేల్చారు. పైగా పురుషుల్లో కంటే మహిళల్లో ఈ రిస్క్ ఎక్కువని తెలిపారు.
18 ఏండ్ల సుదీర్ఘ పరిశోధన..
చైనాలో వయోజనులు అతిగా గుడ్లను ఆహారంగా తీసుకుంటుండటంపై యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నేతృత్వంలో చైనా మెడికల్ యూనివర్సిటీ, ఖతార్ యూనివర్సిటీ సంయుక్తంగా 18 ఏండ్ల పాటు అధ్యయనం చేశాయి. టైప్-2 మధుమేహం కేసులు రోజురోజుకు పెరగడానికి మన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని పరిశోధకుడు మింగ్ లీ చెప్పారు. చైనీయులు గత కొన్ని దశాబ్దాలుగా తమ సంప్రదాయ ఆహారపదార్థాలైన ధాన్యాలు, కూరగాయలకు దూరమవుతూ క్రమంగా ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు అలవాటుపడ్డారు. చైనాలో మధుమేహులు పెరగడానికి ఇది కారణమని పరిశోధకులు తేల్చారు.
గుడ్డు రోజుకు 50 గ్రాములు మించితే 60 శాతం మధుమేహం రిస్క్..!
అయితే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్‌తోపాటు అతిగా గుడ్లను వినియోగించడం కూడా టైప్-2 మధుమేహుల సంఖ్య క్రమంగా పెరిగిపోవడానికి కారణమైనట్లు తమ 18 ఏండ్ల పరిశోధనలో తేలిందని రిసెర్చర్స్ వెల్లడించారు. ఈ 18 ఏండ్ల కాలంలో చైనాలో గుడ్ల వినియోగం రెండింతలయ్యిందని తెలిపారు. తరచూ గుడ్లను ఆహారంగా తీసుకునే వారిలో మధుమేహం రిస్క్ పెరుగుతున్నట్లు, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ఎక్కువగా ఉంటున్నట్లు తేలిందని పేర్కొన్నారు. రోజూ 38 గ్రాముల కంటే ఎక్కువ, 50 గ్రాముల కంటే తక్కువ గుడ్లను ఆహారంగా తీసుకునే వారిలో 25 శాతం.. రోజూ 50 గ్రాముల కంటే ఎక్కువ గడ్లు తినేవారిలో 60 శాతం మధుమేహం రిస్క్ పెరుగుతుందని తెలిపారు.
గుడ్లను ఏ రూపంలో తీసుకుంటే మంచిది..?
చైనా హెల్త్ అండ్ న్యూట్రిషన్ సర్వే పేరుతో జరిగిన తమ పరిశోధనలో సగటున 50 ఏండ్ల వయసున్న 8,545 మంది పాల్గొన్నారని మింగ్ లీ వెల్లడించారు. మధుమేహం బారినపడకుండా ఉండాలంటే గుడ్లను ఉడకబెట్టుకుని మాత్రమే తినడం ఉత్తమమని, దానికి ఉప్పు, కారం, కొత్తిమీర లాంటివి జోడించి తీసుకోవాలని ఆయన సూచించారు. లేదంటే గుడ్లతో వెజిటెబుల్ ఆమ్లెట్లు చేసుకోవాలని సలహా ఇచ్చారు. గుడ్లను నేరుగా కాకుండా కూరగాయలతో కలిపి తీసుకోవడం ద్వారా రిస్క్ తక్కువన్నారు. గుడ్లతో చేసుకునే డిష్‌లలో నెయ్యి, నూనె, చీజ్ లాంటివి వాడకూడదని పేర్కొన్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

