ఇంటీరియర్ డిజైనింగ్ కొత్తపుంతలు తొక్కుతున్నది. రాజస్థానీ, ఎలిజబెత్ ఎరా, సంప్రదాయ.. ఇలా, అభిరుచిని బట్టి నచ్చిన గృహాలంకరణ పద్ధతిని ఎంచుకుంటున్నారు. తాజాగా, అరబ్ శైలి పట్ల చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ దీపకాంతుల విషయంలో.. ఏరికోరి ఎంచుకుంటున్నారు.
అరేబియన్ అలంకరణలో ఆర్భాటం ఉండదు. కానీ, తెలియని హుందాతనం తొంగిచూస్తుంది. కళాత్మకత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీంతో ఇంటీరియర్ డిజైనర్లు దుబాయ్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. సీలింగ్ ల్యాంప్‌లు, షాండిలియర్స్, టేబుల్ ల్యాంప్స్.. దేని అందం దానిదే. యాంటిక్ లాంతర్ల కోసమైతే ఎంతైనా వెచ్చించడానికి సిద్ధపడుతున్నారు.