ప్రతి మహిళ ఈ చట్టాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి!
యావత్ దేశాన్నీ కుదిపేసిన ‘కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన’ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం ‘అపరాజిత’ బిల్లును తీసుకొచ్చింది. మహిళలు - పిల్లలపై లైంగిక నేరాలు, వేగవంతమైన విచారణ, దోషులకు కఠిన శిక్షలు విధించడమే లక్ష్యంగా.. బెంగాల్ అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందింది.
యావత్ దేశాన్నీ కుదిపేసిన ‘కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన’ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం ‘అపరాజిత’ బిల్లును తీసుకొచ్చింది. మహిళలు – పిల్లలపై లైంగిక నేరాలు, వేగవంతమైన విచారణ, దోషులకు కఠిన శిక్షలు విధించడమే లక్ష్యంగా.. బెంగాల్ అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అప్పుడెప్పుడో 2012లో జరిగిన ‘ఢిల్లీ హత్యాచార ఘటన’ సందర్భంగా ‘నిర్భయ’ చట్టం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వం ‘అపరాజిత’ బిల్లును ఆమోదించింది.
ఈ క్రమంలో ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అసలు.. మహిళలు – చిన్నారులపై వేధింపులు, వారి రక్షణ కోసం జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ఎలాంటి చట్టాలు అమలులో ఉన్నాయి? వాటిలో ముఖ్యమైనవి ఏవి? మహిళలను రక్షించడానికి జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో అనేక చట్టాలు రూపొందాయి. అయితే, ఆయా చట్టాలపై సరైన అవగాహన లేకపోవడంతో బాధితులు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో భారతదేశంలోని ప్రతి మహిళా తెలుసుకోవాల్సిన ఏడు ముఖ్యమైన చట్టపరమైన హక్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
1 గృహహింసకు వ్యతిరేకంగా..
గృహహింస నిరోధక చట్టం – 2005.. మహిళలను ఇంట్లో ఎదురయ్యే హింస నుంచి రక్షిస్తుంది. గృహిణిపై చేయి చేసుకోవడమే కాదు.. ఆమెను మాటల ద్వారా, ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా, లైంగికంగా వేధించినా.. 498 సెక్షన్ ప్రకారం దోషులను కఠినంగా శిక్షించవచ్చు.
2 పనికి తగ్గ జీతం
సమాన పనికి సమాన వేతనం పొందడం మహిళల హక్కు. మహిళా కూలీలు మొదలుకొని.. ఉన్నతోద్యోగాలు చేసే మహిళల కోసం ‘సమాన వేతన చట్టం’ అమలులో ఉన్నది. పనిచేసే మహిళలు.. వారి సహోద్యోగులతో సమానమైన వేతనాన్ని ఈ చట్టం ద్వారా డిమాండ్ చేయొచ్చు. కూలీలు, ఉద్యోగినులకు వేతనాలు, ఇతర అలవెన్సుల విషయంలో లింగ వివక్ష చూపడం నేరం కూడా!
3 పని ప్రదేశాల్లో రక్షణ
పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేకమైన చట్టం ఉన్నది. ఈ చట్టం ప్రకారం.. పనిలో లైంగిక వేధింపులకు గురైతే.. ఉన్నతాధికారులకు నివేదించే హక్కు మహిళలకు ఉంది. ఈ చట్టం ప్రకారం.. పనిలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడానికి, వాటిపై విచారణ చేపట్టడానికి సంస్థలు అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటుచేయాలి. పది లేదా అంతకంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్న ప్రతి కంపెనీ.. ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సిందే! ఎవరైనా మహిళా ఉద్యోగి వేధింపులకు గురైతే.. సదరు బాధితురాలు ఈ అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు.
4 రాత్రిపూట అరెస్టు వద్దు
సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయానికి ముందు.. మహిళలను అరెస్టు చేయకూడదు. ఏవైనా తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే.. ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశంతో మాత్రమే రాత్రి సమయంలో మహిళలను అరెస్టు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, మహిళా ఖైదీని ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుల్‌తోపాటు మహిళకు చెందిన కుటుంబసభ్యులు లేదా స్నేహితులు కూడా ఆమె పక్కన ఉండొచ్చు.
5 అజ్ఞాతం.. మీ హక్క
లైంగిక వేధింపులకు గురైన మహిళలకు.. ‘గోప్యత హక్కు’ ఉంటుంది. దీని ప్రకారం.. బాధితురాలి పేరు, ఇతర వివరాలను బయటికి వెల్లడించకూడదు. మేజిస్ట్రేట్ ఎదుట ఒంటరిగా లేదా మహిళా పోలీసు అధికారి సమక్షంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసుకునే హక్కు బాధితురాలికి ఉంటుంది.
6ఉచిత న్యాయ సేవ
లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్.. అత్యాచార బాధితులకు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తుంది. మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు న్యాయ సహాయం పొందడానికి ఈ చట్టం హామీ ఇస్తుంది.
7గౌరవానికి భంగం వద్దు!
లైంగిక వేధింపుల బాధితురాలికి.. తన గౌరవానికి భంగం కలగకుండా చూసుకొనే హక్కు ఉంటుంది. దీని ప్రకారం.. ఏదైనా వైద్య పరీక్షలు అవసరమైతే కేవలం మహిళా వైద్యురాలి ద్వారానే పరీక్షలు నిర్వహించాలి. ఇతరుల సమక్షంలో ఏ విధమైన శారీరక/ మానసిక పరీక్షలు నిర్వహించడం చట్టవిరుద్ధం.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

